Mahindra Atom Price: చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్ ను లాంచ్‌ చేయనున్న మహీంద్రా..!

ప్రముఖ కార్ల తయరీ సంస్థ మహీంద్రా మరో ఆసక్తికరమైన కారు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును మహీంద్రా కంపెనీ రిలీజ్ చేయనుంది. ఆటమ్ క్వాడ్రిసైకిల్స్ పేరిట నాలుగు వేరియంట్స్ ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నారని అంచనా.   
 

Mahindra Atom EV battery capacity.. variants revealed

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పెద్ద ఆటోమేకర్లతో పాటు స్టార్టప్‌లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ ఆటోమ్ క్వాడ్రిసైకిల్‌ను ట్రియో ఆటో, ట్రియో జోర్ డెలివరీ వాన్, ట్రియో టిప్పర్ వేరియంట్, ఇ-ఆల్ఫా మినీ టిప్పర్‌తో పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 3-వీలర్ సెగ్మెంట్లో 73.4 శాతం మార్కెట్ వాటాను మహీంద్రా కంపెనీ కలిగి ఉండడం విశేషం. 

మహీంద్రా ఆటమ్ EV విడుదల

K1, K2, K3. K4 అనే నాలుగు వేరియంట్లలో మహీంద్రా ఆటమ్ (EV) విడుదల కానుంది. మొదటి రెండు వేరియంట్‌లు 7.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. కానీ మిగిలిన వేరియంట్స్ రెండు శక్తివంతమైన 11.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. Atom K1, K3 వేరియంట్స్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో రావు. కానీ.. K2, K4 వేరియంట్స్ లో మాత్రం ఎయిర్ కండిషనర్ సదుపాయం ఉంటుంది. కంపెనీ త్వరలో భారత మార్కెట్‌లో ఆటమ్ క్వాడ్రిసైకిల్స్‌ను విడుదల చేయనుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్స్

ఎలక్ట్రిక్ పవర్ తో నడువనున్న మహీంద్రా ఆటమ్ సౌకర్యవంతమైన, స్మార్ట్ ఫీచర్లతో క్లీన్ ఎనర్జీతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆటమ్‌తో పాటు, మహీంద్రా ఇ-ఆల్ఫా మినీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎలక్ట్రిక్ ఆల్ఫా టిప్పర్‌ను పరిచయం చేసింది. ఇ-ఆల్ఫా మినీ టిప్పర్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీల వరకు నడువగలదు. దీని లోడింగ్ కెపాసిటీ 310 కిలోలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎప్పుడు మార్కెట్లోకి విడుదల కానుందనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. 

రూ. 3 లక్షలు మాత్రమే..!

మహీంద్రా ఆటమ్ డిజైన్, ఫీచర్ల పరంగా పైసా వసూల్ కారుగా చెప్పవచ్చు. దీని ధర చాలా తక్కువగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3 లక్షలు. ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ. వరకు నడుస్తుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios