Mahindra Alfa CNG: ఆల్ఫా ప్యాసింజర్.. కార్గో త్రీవీలర్ ఇప్పుడు సీఎన్‌జీలో కూడా..!

దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా మొబిలిటీ తాజాగా తమ పాపులర్ త్రీవీలర్ మోడెల్ అయిన అల్ఫాలో సీఎన్‌జీ వెర్షన్ ను విడుదల చేసింది. ఇందులో ప్యాసింజర్, కార్గో వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర, ఇతర వివరాలను తెలుసుకోండి.
 

Mahindra Alfa CNG passenger and cargo three wheeler launched

మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తాజాగా తమ బ్రాండ్ నుంచి సరికొత్త త్రీ వీలర్ ఆల్ఫా సీఎన్‌జీని విడుదల చేసింది. ఇది ప్యాసింజర్ అలాగే కార్గో వేరియంట్లలో లభించనుంది. ఇందులో ఆల్ఫా ప్యాసింజర్ DX BS6 CNG వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 2,57,000 ఉండగా.. ఆల్ఫా లోడ్ ప్లస్ వేరియంట్ ధరను రూ. 2,57,800 గా నిర్ణయించారు. ప్యాసెంజర్ వేరియంట్ కంటే కార్గో వాహనానికి రూ. 800 అధికంగా చెల్లించాలి.

మహీంద్రా బ్రాండ్ నుంచి ఆల్ఫా సిరీస్ త్రీ వీలర్‌లు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందినవి. ఇప్పుడు ఇందులోనే సీఎన్‌జీ వెర్షన్లను ప్రవేశపెట్టడం గమనార్హం. ఇప్పుడున్నCNG, డీజిల్ ధరల ఆధారంగా కొత్తగా విడుదలైన ఆల్ఫా కార్గో CNG ఆటో కలిగిన యజమానులు ఆల్ఫా డీజిల్‌ ఆటోతో పోల్చినప్పుడు 5 సంవత్సరాల వ్యవధిలో ఇంధనంపై సుమారు రూ. 4,00,000 వరకు ఆదా చేసుకోవచ్చని మహీంద్రా సంస్థ పేర్కొంది.

ఇంజన్ కెపాసిటీ, సర్వీస్

ఈ త్రీవీలర్ 395 cm3, వాటర్-కూల్డ్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 23.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ వేగంతో 20Nm టార్క్ సాఫీగా లోడ్ మోసుకెళ్తుందని కంపెనీ తెలిపింది. ఈ త్రీవీలర్ నిర్మాణం దృఢమైన ఆల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. ఆల్ఫాలోని మెటల్ షీట్ 0.90mm మందంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే వీటి నిర్వహణ కోసం భారతదేశం అంతటా 800 ప్లస్ డీలర్ టచ్ పాయింట్లను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ వాహనాలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు సహా మరి దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. దేశంలో ఇప్పుడు CNG స్టేషన్లు విస్తరిస్తున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో డీజిల్ వాహనాలతో పోలిస్తే CNG ఉత్తమ ఎంపిక అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios