ఎక్కువ మైలేజీచ్చే కారు కోసం చూస్తున్నారా.. టాప్ 5 బెస్ట్ కార్స్ లిస్ట్ ఇదే..

మారుతి  ఆల్టో కారు మొదటిసారిగా కార్లను కొనుగోలు చేసేవారిలో అలాగే అధిక మైలేజ్ కార్లలో ఒకటి. కారు ధర కూడా కేవలం రూ. 4 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 

Looking for  best car with  highest mileage, here is list of top 5 vehicles

మీరు  ఎక్కువ లేదా బెస్ట్ మైలేజీనిచ్చే కారు కోసం చూస్తున్నారా.. అయితే ఆలోచించాల్సిన పని లేదు.  మార్కెట్లో  మీకు గొప్ప మైలేజీ ఇచ్చే పాపులర్ 5 బడ్జెట్ కార్లు ఉన్నాయి. వాటి గురించి మీకోసం..

మారుతి ఆల్టో
ఈ ఆల్టో కారు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీని ఇస్తుంది. మారుతి  ఆల్టో కారు మొదటిసారిగా కార్లను కొనుగోలు చేసేవారిలో అలాగే అధిక మైలేజ్ కార్లలో ఒకటి. కారు ధర కూడా కేవలం రూ. 4 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారు పెట్రోల్ వెర్షన్‌ మైలేజ్ ఆవరేజ్ గా  22.05 kmpl అలాగే  సి‌ఎన్‌జి మోడల్ 31.59 kmpl మైలేజ్ ఇస్తుంది.

మారుతి ఆల్టో K10
Kసిరీస్ ఇంజన్‌తో వస్తున్న ఈ కారు లేటెస్ట్ గా విడుదలైంది. కంపెనీ ఆ కారులో 1 లీటర్ ఇంజిన్ ఇచ్చింది.  పవర్ ఇవ్వడమే కాకుండా మంచి మైలేజీని కూడా ఇస్తుంది. మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో  పెట్రోల్ కారు లీటర్‌కి 24.39 కి.మీ వరకు, AGS ట్రాన్స్‌మిషన్‌తో  లీటరుకు మైలేజీ 24.90 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

డాట్ సన్ రెడీగో 
జపనీస్ కంపెనీ డాట్ సన్    రెడీ గో 0.8 అండ్ 1 లీటర్ ఇంజన్లతో వస్తుంది. దీనికి మాన్యువల్‌ గేర్ తో AMT ఆప్షన్ కూడా పొందుతుంది. కంపెనీ ప్రకారం, 800cc ఇంజిన్‌ రెడీగో 20.71 kmpl మైలేజీ ఇస్తుంది,  1 లీటర్ మాన్యువల్ గేర్ ఇంజన్‌  21.7 అలాగే  AMT వెర్షన్  22 kmpl మైలేజీ ఇస్తుంది. 

హ్యుందాయ్ సాంట్రో
ఈ కారు 3 సంవత్సరాలు లేదా లక్ష కి.మీల వారంటీతో వస్తోంది. కంపెనీ ఈ కారులో 1.1 లీటర్ పెట్రోల్ అండ్ సి‌ఎన్‌జి ఆప్షన్ ఇచ్చింది.  పెట్రోల్ ఇంకా సి‌ఎన్‌జి ఆప్షన్ కారణంగా దీని మైలేజ్ కూడా 20 kmpl కంటే ఎక్కువే. 

రెనాల్ట్ క్విడ్
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్  చిన్న కారు క్విడ్ మైలేజ్ పరంగా పెద్ద కార్లతో పోటీపడుతుంది. AMT గేర్ తో  1 లీటర్ ఇంజన్ 22 kmpl మైలేజీని ఇస్తుంది.  మాన్యువల్  గేర్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు 22.02 kms మైలేజీని ఇస్తుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios