Asianet News TeluguAsianet News Telugu

సరికొత్తగా విపణిలోకి హోండా ‘సీబీషైన్ ప్లస్ యాక్టీవా 5జీ’

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ మార్కెట్లోకి సరికొత్తగా హోండా సీబీషైన్, యాక్టీవా 5జీ స్కూటర్ లిమిడెడ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ రెండు మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న బైక్‌లు, స్కూటర్లుగా నిలిచాయి.

Limited Edition Honda CB Shine Launched At Rs. 59,083
Author
Mumbai, First Published May 28, 2019, 11:23 AM IST

ముంబై: హోండా మోటార్స్ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా రెండు సరికొత్త లిమిటెడ్‌ ఎడిషన్‌ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది.  125 సీసీ సామర్థ్యంతో కూడిన హోండా సీబీ షైన్‌ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాహనం డ్యూయల్‌ టోన్‌ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.59,083గా నిర్ణయించారు. దీనిలో సరికొత్త గ్రాఫిక్‌ డిజైన్‌, సరికొత్త ఫ్యూయల్‌ ట్యాంక్‌ను అమర్చారు. అదనంగా న్యూ విజర్ గ్రాఫిక్ డిజైన్ సైడ్‌ ప్యానల్స్‌, రియర్‌ కౌల్‌ను కూడా మార్చారు. పాత షైన్‌లో ఉన్న ఇంజిన్‌నే దీనిలో కూడా కొనసాగించారు.  

అత్యధిక సేల్స్ మోడల్స్ సీబీషైన్స్, యాక్టీవా 5జీ
భారతదేశంలో హోండా మోటార్స్ టాప్ సెల్లింగ్ మోడల్ బైక్స్‌ల్లో  హోండా సీబీ సైన్, యాక్టీవా ఉన్నాయి. లిమిడెడ్ ఎడిషన్‌తో కూడిన హోండా సీబీ షైన్స్, యాక్టీవా 5జీ మోడల్ బైక్‌లను ఆవిష్కరిస్తున్నట్లు హోండా మోటార్స్ తెలిపింది. 

హోండా సీబీషైన్స్ ఫీచర్లు ఇలా
ఫోర్ స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, 5500 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం పీక్ టార్చి, 7500 ఆర్పీఎం వద్ద 10.16 బీహెచ్పీ సామర్థ్యం దీని సొంతం. 4- స్పీడ్ గేర్ బాక్స్ ఇంజిన్ కలిగి ఉన్న హోండా సీబీషైన్.. కాంబీ బ్రేక్ సిస్టమ్‌తో డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లలో అందుబాటలో ఉంటుంది. ప్రతియేటా తొమ్మిది లక్షలకు పైగా సీబీ షైన్ బైక్ లు అమ్ముడు పోతున్నాయి.  

సరికొత్తగా విపణిలోకి ‘యాక్టివా 5జీ’ స్కూటర్
హోండా తన స్కూటర్‌ విభాగం నుంచి యాక్టివా 5జీ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది కూడా 10 ప్రీమియం పెరల్ ప్రీసిస్ వైట్, స్ట్రోనియం సిల్వల్ మెటాలిక్ విత్ పెరల్ ఇగ్నియస్ బ్లాక్‌తో డ్యూయల్‌ టోన్‌ కలర్స్‌లో లభిస్తుంది. దీనిలో సరికొత్త గ్రాఫిక్స్‌, బ్లాక్‌ రిమ్స్‌, క్రోమ్‌ మఫ్లర్‌ కవర్‌, పూర్తి నలుపు రంగు ఇంజిన్‌ లభిస్తుంది.

యాక్టీవా 5జీ ధర రూ.55,032
కాకపోతే దీనిలో ఎటువంటి టెక్నికల్‌ అప్‌డేట్లను ఇవ్వలేదు. దీని ధర రూ.55,032గా నిర్ణయించారు. ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూ స్టైలిష్ గ్రాఫిక్స్, బ్లాక్ రిమ్స్, క్రోమ్ మఫ్లర్ కవర్ తదితర ఫీచర్లు జత కలిపారు. 

కస్టమర్ల విశ్వాసంతోనే హోండా యాక్టీవా
‘వినియోగదారుల విశ్వాసమే హోండాను నమ్మకమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో మేం వినియోగదారుల కోసం సరికొత్త యాక్టివా 5జీ, సీబీ షైన్’ను మార్కెట్లోకి  తీసుకొచ్చాం’ అని హోండా సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు.

వచ్చే ఏడాది బీఎస్ -6 ప్రమాణాలతో యాక్టీవా 6జీ
వచ్చే ఏడాది బీఎస్ -6 ప్రమాణాలతో హోండా యాక్టీవా 6జీ మోడల్ స్కూటర్ విపణిలోకి రానున్నది. ప్రస్తుతం యాక్టీవా 5జీ మోడల్ స్కూటర్లు ఏటా 30 లక్షలకు పైగా అమ్ముడు పోతున్నాయి. కాకపోతే గతేడాది 4.6 శాతం సేల్స్ తగ్గాయి. 2017-18లో 31.54 లక్షల స్కూటర్లు అమ్మితే 2018-19లో 30.08 లక్షలు మాత్రమే విక్రయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios