టార్గెట్ ఇండియా: లంబోర్ఘిని నుంచి ‘హరికేన్ ఎవో’
ఈ ఏడాది లంబోర్ఘిని మోడల్ కార్ల విక్రయాల్లో 60 శాతం పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని లంబోర్ఘిని భారత్ అధిపతి శరద్ అగర్వాల్ చెప్పారు. నాలుగైదేళ్లలో టాప్ -15 దేశాల మార్కెట్లలో అగ్రశ్రేణిగా నిలువాలని లంబోర్ఘిని ఆకాంక్షిస్తోంది. తాజాగా హరికేన్ ఎవో మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇటలీ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని అతి ఖరీదైన కారును భారత విపణిలోకి విడుదల చేసింది. హరికేన్ ఎవో పేరుతో మార్కెట్లో ఆవిష్కరించిన ఈ కారు ధర రూ .3.73 కోట్లుగా నిర్ణయించింది.
ఈ ఏడాది కార్ల విక్రయాల్లో 60 శాతం పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లంబోర్ఘిని భారత్ అధిపతి శరద్ అగర్వాల్ చెప్పారు. వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో టాప్ 15 గ్లోబల్ మార్కెట్లలో సేల్స్ రికార్డులను బ్రేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు లంబోర్ఘిని కారు హరికేన్ ఎవో మోడల్ కారు డెలివరీ కోసం కొనుగోలుదారులు ఆరు నెలల పాటు వేచి చేడాల్సి ఉంటుంది. లంబోర్ఘినీ హరికేన్ ఎవో కారు మార్కెట్లోకి వచ్చే మే, జూన్ నెలల్లో వస్తుంది.
2018లో సూపర్ లగ్జరీ కార్ల విక్రయాల్లో భారతదేశంలోనే తామే అగ్రస్థానంలో ఉన్నామని లంబోర్ఘిని భారత్ అధిపతి శరద్ అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాదిలోనూ తమ స్థానాన్ని మరింత పటిష్టపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది కార్ల సేల్స్‌లో 55-50 శాతం పురోగతి సాధించగలమని భావిస్తున్నామన్నారు.
5.2 లీటర్ ఇంజిన్ సామర్థ్యం, వీ10 పవర్, మల్టీ పాయింట్ ఇంజెక్షన్ + డీఎస్ఐ డీజిల్ గరిష్ట టార్చ్ 640, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్, రియర్ వీల్ డ్రైవ్ సిస్టం, రియర్ మెకానికల్ సెల్ఫ్ లాకింగ్ ఫీచర్లతోపాటు కొత్తగా అడ్వాన్స్‌డ్ న్యూ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంను జోడించింది.
కాగా గత సంవత్సరం భారతదేశంలో 45 యూనిట్లు విక్రయించగా, 2017లో 26 యూనిట్లు విక్రయించింది. ప్రపంచవ్యాప్తంగా లంబోర్ఘిని గత సంవత్సరం 5,750 యూనిట్లు విక్రయించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2017 లో 1,000 యూనిట్ల నుంచి 1,301 యూనిట్లను సేల్ చేసింది.
రోల్స్ రాయిస్, బెంట్లీ, ఫెర్రారీ, ఆస్టోన్ మార్టిన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ అండ్ ఆడి కార్లను పోటీ పడేందుకు వీలుగా లంబోర్ఘిని హరికేన్ ఎవో మోడల్ కారును మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం అమెరికా, జపాన్, బ్రిటన్, గ్రేటర్ చైనా, జర్మనీ, కెనడా, మద్య ప్రాచ్యం, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ దేశాల్లో లంబోర్ఘినీ టాప్ స్థానంలో నిలిచింది.