జీప్ కంపాస్ 5th యానివర్సరీ ఎడిషన్: ట్విటర్ ద్వారా టీజర్ వీడియో లాంచ్.. కొత్త లుక్, అదిరే స్టయిల్..

ఈ మిడ్-సైజ్ SUVని మొదటిసారిగా జూలై 2017లో ఇండియాలో లాంచ్ చేసింది. అప్పటి నుండి కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అలాగే 2020లో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ పొందింది, ఆ తర్వాత చాలా కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Jeep India has released teaser of 5th Anniversary Edition version of its popular SUV Compass on its social media platform

జీప్ ఇండియా  ప్రముఖ SUV కంపాస్ (Compass) 5వ వార్షికోత్సవ ఎడిషన్ వెర్షన్ టీజర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసింది. అయితే కంపెనీ ఈ SUVని త్వరలో లాంచ్ చేయవచ్చని చూపిస్తుంది. ఈ మిడ్-సైజ్ SUVని మొదటిసారిగా జూలై 2017లో ఇండియాలో లాంచ్ చేసింది. అప్పటి నుండి కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అలాగే 2020లో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ పొందింది, ఆ తర్వాత చాలా కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

అయితే, కంపెనీ  లేటెస్ట్ టీజర్ లో అప్ కమింగ్  SUV స్పెషల్ వెర్షన్ గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ దీనికి కొన్ని చిన్న కాస్మెటిక్స్ అప్‌డేట్‌లు లేదా కొత్త కలర్ స్కీమ్ లభిస్తుందని భావిస్తున్నారు. అదనంగా కంపాస్ 5th యానివర్సరీ ఎడిషన్ మోడల్ కూడా స్పెషల్ ఎడిషన్ థీమ్‌ హైలైట్ చేస్తూ కొత్త బ్యాడ్జ్‌తో వస్తుంది. దీనిని భారత మార్కెట్లో  కొన్ని మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

ఇంజిన్ అండ్ పవర్
మెకానికల్‌గా జీప్ కంపాస్ 5th యానివర్సరీ ఎడిషన్ (Jeep Compass 5th Anniversary Edition) స్టాండర్డ్ వేరియంట్‌లోనే ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో కొత్త జీప్ మెరిడియన్‌లో ఉపయోగించిన 2.0-లీటర్, 4-సిలిండర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌  పొందుతుంది. ఈ ఇంజన్ 167 bhp శక్తిని, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అండ్ FWD ఇంకా AWD డ్రైవ్‌ట్రైన్‌లతో కూడిన 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి.

జీప్ కంపాస్ 160 bhp శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అండ్ 7-స్పీడ్ DCTతో వస్తుంది.

ఫీచర్ల గురించి మాట్లాడుతూ దీనిలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. కొత్త జీప్ కంపాస్ 5వ యానివర్సరీ ఎడిషన్ రాబోయే రోజుల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios