మార్కెట్లోకి రోవర్ ‘స్వర్ణోత్సవ’ ఎక్స్‌జే50: గంటకు 250 కి.మీ. స్పీడ్

టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఏర్పాటై 50 ఏళ్లవుతున్న సందర్భంగా నూతన మోడల్ ఎక్స్ జే50 మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. 

Jaguar XJ50 launched in India,

టాటా మోటార్స్‌ అనుబంధ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) జాగ్వార్‌ ఎక్స్‌జే మోడల్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్‌ ఎక్స్‌జే మోడల్‌ మార్కెట్లోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్పెషల్‌ ఎడిషన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఆ మోడల్ కారు పేరు ’జాగ్వార్‌ ఎక్స్‌జే50’ అని నామకరణం చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్‌ సూరి తెలిపారు. ఈ కారు ధర రూ.1.11 కోట్లని, మూడు లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌తో తయారైన ఈ కారు కోసమే ప్రత్యేకంగా 19అంగుళాల అలాయ్‌ వీల్స్‌ను రూపొందించామని ఆయన చెప్పారు.

కేవలం 6.2 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు గరిష్టగా గంటకు 250 కి.మీ. వేగం పుంజుకుంటుందని అని పేర్కొన్నారు. ఈ కారులో ఎయిట్‌– స్పీడ్‌ జెడ్‌ఎఫ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్, తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 

‘ఓలా’కు సాఫ్ట్ బ్యాంక్ బిలియన్ల డాలర్ల పెట్టుబడి
క్యాబ్‌ అగ్రిగేటర్​ ‘ఓలా’కు భారీ పెట్టుబడుల ఆఫర్‌ లభించింది. జపాన్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ సాఫ్ట్‌బ్యాంకు మరోసారి ఓలాలో భారీ పెట్టుబడులకు దిగుతోంది. ఓలాలో ఒక బిలియన్ డాలర్ల (రూ.704కోట్లు) నిధులను సరఫరా చేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.

అయితే  ఇప్పటికే ఓలాలో 26శాతం వాటా వున్న సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులను ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్   ఆమోదించారా? లేదా? అనేది స్పష్టతలేదు. మరోవైపు బెంగళూరుకు చెందిన కంపెనీ టాక్సీ సేవల సంస్థ ఓలా తన ఆహార పంపిణీ వ్యాపారాన్ని విస్తరణకు సిద్ధంగా ఉంది.  అంతేకాదు, ఈ-ఫార్మసీ వంటి విభాగాలలో పెట్టుబడులకు యోచిస్తోంది.

గుడ్‌నైట్‌ నుంచి నీమ్‌ దోమల బత్తీలు
దోమల నివారణకు గాను గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ సంస్థ సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. గుడ్‌నైట్‌ బ్రాండ్‌తో ఇప్పటికే మార్కెట్లో వివిధ రకాల దోమల నివారణ ఉత్పత్తులను అందిస్తోన్న సంస్థ  ప్రకృతిలోని సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారు చేసిన 'గుడ్‌నైట్‌ నేచురల్స్‌ నీమ్‌ అగర్‌బత్తీలను' సంస్థ మార్కెట్లోకి ఆవిష్కరించింది.

ఈ దోమల అగర్‌బత్తీలను పూర్తిగా 100% ప్రకృతి సిద్ధమైన దోమల నివారణిగా రూపొందించినట్టుగా సంస్థ సీఈవో సునీల్‌ కటారియా తెలిపారు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన దోమల బత్తీల విక్రయం విరివిగా సాగుతోందని అన్నారు.

ప్రజలు అవగాహన లేమితో వాటిని కొనుగోలు చేసి వివిధ రకాల శ్వాసకోశ వ్యాధులకు గురి అవుతున్నారని వివరించారు. పది అగర్‌బత్తీలుండే ఈ అగర్‌బత్తీల ప్యాకెట్‌ ధరను కంపెనీ రూ.15లుగా నిర్ణయించింది. ఒక్క బత్తీ దాదాపు మూడు గంటల పాటు వెలుగుతూ దోమలు ఇంట్లోకి రాకుండా కవచంలా కాపాడుతాయని ఆయన అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios