రోడ్ సైడ్ ఆసిస్టన్స్ కోసం గ్లోబల్ అష్యూర్ తో ఈవియం ఒప్పందం.. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు 24x7 సపోర్ట్..
బ్రాండు వేగంగా ఉత్పత్తులు, సేవల విభాగం పరిధిని విస్తరించుకుంటోంది. ఇప్పటివరకు రోడ్డు మీదికి 3 విద్యుత్ ద్వి-చక్ర వాహన ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో కాస్మో, కోమెట్ అండ్ సిజార్ ఉన్నాయి.
హైదరాబాద్: ఇండియాలోని ప్రీమియం విద్యుత్ వాహన బ్రాండు Eveium, ఇండియాలోని అగ్రగామి రోడ్ సైడ్ ఆసిస్టన్స్ కంపెనీ గ్లోబల్ అష్యూర్ (Global Assure) తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యనికి తదుపరిగా గ్లోబల్ అష్యూర్, ఇతర ఆసిస్టన్స్ సేవలతో పాటుగా ఏదైనా బ్రేక్‌డౌన్ కు సంబంధించి EVeium కస్టమర్లకు 24x7 సపోర్ట్ అందిస్తుంది.
ఈ ప్రోగ్రాము క్రింద కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు:
•వెహికల్ టోయింగ్
•ఫ్లాట్ టైర్ రిపేర్/మార్పు
•ఆన్-సైట్ రిపేర్
•కీ లాక్ఔట్ సేవలు
•ఆంబులెన్స్ రెఫరల్
•వెహికల్ ఎక్స్‌ట్రాక్షన్
•బంధువులు/సహోద్యోగులు/ఎమర్జెన్సీ నంబరుకు మెసేజ్ పంపించడం
•హోటల్ ఆసిస్టన్స్
•24x7 రెస్పాన్స్ సెంటర్
ఈ సందర్భంగా Eveium మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి గారు మాట్లాడుతూ “బ్రాండు నాణ్యమైన ఉత్పాదనను, దానిని అనుసరించి ఒక చక్కని పోస్ట్ సేల్స్ సర్వీస్ అందించడానికి కృతనిశ్చయముతో ఉంది. మాకైతే ఒక అనుభవాన్ని అందజేయడం, దానిని నిర్వహణ చేయడం రెండూ సమానంగా ముఖ్యం. గ్లోబల్ అష్యూర్ తో ఆనుబంధం మా ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుంది. ఈ బ్రాండు ఈ రంగంలోని దిగ్గజాలలో ఒకటిగా ఉంటోంది ఇంకా మా కస్టమర్లకు భద్రత, సౌకర్యాన్ని కల్పించడంలో మాకు సహాయపడుతుంది” అని అన్నారు.
బ్రాండు వేగంగా ఉత్పత్తులు, సేవల విభాగం పరిధిని విస్తరించుకుంటోంది. ఇప్పటివరకు రోడ్డు మీదికి 3 విద్యుత్ ద్వి-చక్ర వాహన ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో కాస్మో, కోమెట్ అండ్ సిజార్ ఉన్నాయి.
“EVeium అనేది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్, రోడ్ సైడ్ ఆసిస్టన్స్ కొరకు అత్యుత్తమమైన సర్వీస్ ప్రొవైడర్ ఎంచుకునే వేటలో వారు మమ్మల్ని భాగస్వామిగా ఎంచుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మా విస్తృతమైన నెట్‌వర్క్ అండ్ టోల్ ఫ్రీ కస్టమర్ సపోర్ట్ భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలను నడుపుకోవడాన్ని ఒత్తిడి లేని అనుభవంగా చేస్తుంది ఇంకా భద్రతను నిర్ధారిస్తుంది. ఇ-మొబిలిటీ ధ్యేయాన్ని విజయవంతం చేయడానికై మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే EVeiumతో భాగస్వామ్యము ఈ దిశగా మరొక ముందడుగు అవుతుంది.” అని గ్లోబల్ అష్యూర్ - హెడ్ స్ట్రాటిజిక్ అలియన్స్ శ్రీ. రోహిత్ గుప్తా అన్నారు.
EVeium ఇప్పటిక్ దక్షిణ భారతదేశములో ఒక బలమైన ఉనికిని చాటుకొంది, అలాగే వచ్చే రెండు త్రైమాసికాలలో 5 రాష్ట్రాలు, 10 నగరాలలో ఉనికిణి విస్తరింపజేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 50,000 యూనిట్లను తయారు చేయాలని బ్రాండు లక్ష్యంగా పెట్టుకుంది.
Eveium గురించి
EVeium అనేది Ellysium ఆటోమోటివ్స్ క్రింద ఒక ఎలెక్ట్రిక్ 2-వీలర్ అండ్ EV బ్రాండు. Eveium వద్ద ఎలక్ట్రిక్ ప్రయాణం భవిష్యత్ ఉద్దేశితమైన ఇంకా సురక్షిత మార్గమును సులభంగా అవలంబించడానికి క్లీన్ ఎనర్జీ అండ్ సుస్థిర ఎకోసిస్టమ్ వ్యవస్థను నెలకొల్పాలనేది మా దార్శనికతగా ఉంది. మేము మా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోజు నుండీ, మా ఉత్పత్తులు పర్యావరణ హితమైనవిగా ఉండేలా చూసుకోవడానికి మేము నిబద్ధులమై ఉన్నాము. అనుకూలమైన, చక్కని బ్యాటరీచే, మన్నికను అందించే మెటీరియల్ ఆప్షన్ తో, నిజంగా సుస్థిరమైనదిగా రూపొందిస్తూ చక్కని విద్యుత్ వాహనాన్ని అందించడానికి EVEIUM అంకిత భావంతో ఉంది!