Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ బైక్స్‌కు ఇండియాదే లీడ్.. సచిన్ బన్సాల్


భారతదేశానికి ‘విద్యుత్’ వినియోగ మోటారు సైకిళ్లు, స్కూటర్ల మార్కెట్‌కు సారథ్యం వహించే సత్తా ఉందని ఏంజిల్ ఇన్వెస్టర్, ఫ్లిప్ కార్ట్ మాజీ సీఈఓ సచిన్ బన్సాల్ పేర్కొన్నారు.

India has the potential to lead electric two-wheeler race: Sachin Bansal
Author
New Delhi, First Published May 29, 2019, 1:13 PM IST

న్యూఢిల్లీ: విద్యుత్ వినియోగ ద్విచక్ర వాహనాల విపణికి సారథ్యం వహించే సామర్థ్యం భారతదేశానికి ఉన్నదని ఫ్లిప్ కార్ట్ మాజీ సీఈఓ సచిన్ బన్సాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ సంస్థ ఆథర్ ఎనర్జీలో ఏంజిల్ ఇన్వెస్టర్‌గా ఉన్న సచిన్ బన్సాల్ తాజాగా రూ.223 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టారు.

వచ్చే ఐదేళ్లలో ఆథర్ సంస్థ 10 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించాలని లక్ష్యం నిర్దేశించుకున్నదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
వినియోగదారుల్లోని ట్రాక్షన్ తనను అట్రాక్షన్ చేసిందని ఫ్లిప్ కార్ట్ మాజీ సీఈఓ సచిన్ బన్సాల్ చెప్పారు. 

ఇటీవల వచ్చిన కన్జూమర్ ఫీడ్ బ్యాక్ అద్భుతమైందని సచిన్ బన్సాల్ అన్నారు. పీపుల్ వారికి సొంతంగా ఫ్యాన్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. తానెప్పుడు బెంగళూరుకు వచ్చినా నన్ను చుట్టుముట్టి ఆథర్ విద్యుత్ ఆధారిత స్కూటర్ల గురించి ఎంక్వైరీ చేస్తు్నారన్నారు. 

ఇది ఫీచర్ ఫోన్ల స్థానే స్మార్ట్ ఫోన్లను వినియోగించినట్లుగా ఉన్నదని సచిన్ బన్సాల్ చెప్పారు. తాను నాలుగేళ్లుగా కంపెనీతో పని చేస్తున్నానని, పూర్తిగా భారత్ కు పరిమితమై సంస్థ పని చేస్తున్నదన్నారు. ఆర్ అండ్ డీ, డిజైన్ ది ప్రొడక్ట్, సొంతంగా బ్యాటరీల తయారీకి చర్యలు చేపడుతుందన్నారు.

సాఫ్ట్ వేర్ అండ్ హార్డ్ వేర్ సొంతంగా అభివ్రుద్ధి చేసి అసెంబ్లింగ్ చేస్తున్నట్లు సచిన్ బన్సాల్ తెలిపారు. విద్యుత్ వినియోగ కార్ల ధర రూ.1.2 లక్షలు అంటే ఎక్కువ ధర అనిపించినా.. వినియోగదారులు అర్థం చేసుకుంటారని సచిన్ బన్సాల్ తెలిపారు.

పెట్రోల్ వాడకంతో పోలిస్తే ఇది చాలా చౌక అని సచిన్ బన్సాల్ అభిప్రాయ పడ్డారు. విద్యుత్ ఆధారిత వాహానాల తయారీ కోసం స్టార్టప్ కంపెనీలు, మెయిన్ స్ట్రీమ్ సంస్థలు పోటీ పడుతున్నాయని చెప్పారు. బెంగళూరులో టీవీఎస్.. విద్యుత్ వాహనాల కోసం పెట్టుబడులు పెట్టిందని సచిన్ బన్సాల్ చెప్పారు. 

వచ్చే ఐదేళ్లలో విద్యుత్ ఆధారిత ఆటో సేల్స్ మూడు కోట్లు దాటతాయన్నారు సచిన్ బన్సాల్. పది లక్షలకు పైగా స్కూటర్లను కొనుగోలు చేస్తారని అంచనా.ఈ క్రమంలో ద్విచక్ర వాహనాల విభాగానికి ఆథర్ సారథ్యం వహిస్తుందని తెలిపారు. 

ప్రధాన ఆటోమొబైల్ సంస్థలను ఆర్థిక అండదండలు ఉంటాయని సచిన్ బన్సాల్ చెప్పారు. వోక్స్ వ్యాగన్ తొలి విద్యుత్ కారు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది దీర్ఘ కాలిక ప్రణాలికతో కూడిన రంగం అని తెలిపారు. జీవిత కాలం అంతా ఇందులోనే కొనసాగిస్తానని ఆయన అన్నారు. 

భారతదేశంలో ఉత్పత్తి చేసిన విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సచిన్ బన్సాల్ పేర్కొన్నారు. ‘ఫేమ్-2’ కింద ప్రస్తుతం దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

తాను కన్జూమర్ టెక్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చానని సచిన్ బన్సాల్ చెప్పారు. వినియోగదారులకు ఏది నచ్చుతుందో తాను అర్థం చేసుకోగలని ఆథర్ సంస్థలో ఇన్వెస్ట్ మెంట్ నా వ్యక్తిగతం అని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios