Asianet News TeluguAsianet News Telugu

మీరు ట్విట్టర్‌ని కొనలేకపోతే...: ఎలాన్ మస్క్‌కి అదార్ పూనావాలా స్వీట్ సలహా..

గత నెలలో ఎలోన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. అయితే ఇటీవలి కాలంలో దీనిని అతిపెద్ద టెక్ డీల్ అని కూడా పిలుస్తారు. 
 

If you can't buy Twitter then...: Adar Poonawalla gave this advice to Elon Musk
Author
Hyderabad, First Published May 11, 2022, 10:50 AM IST

కోవిషీల్డ్, కోవోవాక్స్ వంటి కరోనా వ్యాక్సిన్లను తయారు చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)సి‌ఈ‌ఓ అదర్ పూనావాలా భారతదేశంలో పెట్టుబడులు పెట్టమని ఎలోన్ మస్క్‌కి సలహా ఇచ్చారు.  ఒక ట్వీట్‌లో అదర్ పూనావాలా టెస్లా కార్ల గురించి కూడా ప్రస్తావించారు అలాగే భారతదేశంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని అన్నారు. 

ఎలోన్ మస్క్ ని ట్యాగ్ చేసిన తర్వాత పూనావాలా ఏం చెప్పారంటే ?
అదార్ పూనావాలా తన ట్వీట్‌లో "ఎలోన్ మస్క్ మీరు Twitter కొనుగోలు చేయడంలో విజయం సాధించకపోతే, అధిక-నాణ్యత ఇంకా భారీ-ఉత్పత్తిగల టెస్లా కార్లను ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కోసం చూడండి. మీరు చేసిన అన్నీ పెట్టుబడులలో అత్యుత్తమ పెట్టుబడి ఇదే అవుతుంది అని నేను మీకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను." అని అన్నారు.

గత నెలలో ఎలోన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను  44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు  చేసేందుకు ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. ఈ డీల్ ఇటీవలి కాలంలో అతిపెద్ద టెక్ డీల్ అని కూడా చెప్పవచ్చు. దీనితో ట్విట్టర్ ఇప్పుడు ఎలోన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో భాగమైంది. దీనితో పాటు అతనికి రెండు అతిపెద్ద కంపెనీలైన టెస్లా, స్పేస్‌ఎక్స్ ఉన్నాయి. 

టెస్లా కార్లు ఇండియాలో 
ఎలాన్ మస్క్  టెస్లా కార్లను భారత్‌లో ఇంకా లాంచ్ చేయలేదు. ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో కొత్త కోణాన్ని సృష్టించిన టెస్లా కార్లు ఎక్కువగా US అండ్ చైనాలో ఉత్పత్తి చేయబడుతున్నాయి, అయితే ఈ కార్లను భారతదేశంలో దిగుమతి చేసుకోవడం అనేది అధిక దిగుమతి సుంకాలను ఆకర్షిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో చైనా నుండి దిగుమతి చేసుకున్న కార్లను భారతదేశానికి తీసుకురావాలనే ఎలోన్ మస్క్ నిర్ణయం చాలా కష్టం. అయితే భారత్‌లోని టెస్లా ప్లాంట్ల ద్వారా కార్లను ఉత్పత్తి చేస్తే అది తనకు మరింత లాభదాయకమైన ఒప్పందం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఎలోన్ మస్క్‌కు ప్రతిపాదించింది. 

అయితే టెస్లా ఇంకా భారతదేశంలో ఉత్పత్తి మార్గాలను అన్వేషించలేదని కాదు. గత సంవత్సరం, టెస్లా మోటార్స్ కర్ణాటకలో తయారీ కర్మాగారాన్ని తెరవడానికి ఆసక్తిని కనబరిచింది. అయితే, అప్పుడు ఈ ప్లాన్ వర్క్ ఔట్ కాలేదు. అప్పటి నుండి మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్,  తమిళనాడు రాష్ట్రాలు టెస్లా ఉత్పత్తిని ప్రారంభించమని ఎలోన్ మస్క్‌ని ఆహ్వానించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios