Asianet News TeluguAsianet News Telugu

వారంలోపే 20 వేలు దాటిన ‘వెన్యూ’ బుకింగ్స్

భారతదేశ విపణిలోకి హ్యుండాయ్ మోటార్స్ తొలిసారి ఆవిష్కరించిన సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు బుకింగ్స్ లో రికార్డులు నెలకొల్పుతోంది. ఆవిష్కరించిన వారంలోనే బుకింగ్స్ 20వేలు దాటాయి.

Hyundai Venue Bookings Cross 20,000 Mark
Author
New Delhi, First Published May 29, 2019, 11:52 AM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హ్యుండాయ్’ గత వారం విపణిలోకి విడుదల చేసిన సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘వెన్యూ’ బుకింగ్స్‌లో రికార్డులు నెలకొల్పుతోంది. గతవారం ఆవిష్కరణ నాటికి 15 వేల బుకింగ్స్ నమోదు కాగా.. ప్రస్తుతం బుకింగ్స్ 20 వేలు దాటాయి. 

అయితే వెహికల్ సేల్స్ ఏ మేరకు సాగాయన్న విషయం వచ్చే నెలలో గానీ తేలదు. హ్యుండాయ్ సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ తొలి మోడల్ కారు వెన్యూకు అద్భుతమైన ఆదరణ కనిపిస్తోంది. ఎస్‌యూవీ సబ్ కంపాక్ట్ మోడల్ కార్ల పట్ల భారతదేశంలో ఇప్పటికే ఆదరణ ఉంది. 

ఇప్పటికే ఈ కేటగిరీలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, ఫోర్డ్ ఎకో‌స్పోర్ట్ దూసుకెళ్తున్నాయి. అయితే హ్యుండాయ్ మోటార్స్ భారత కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ఆవిష్కరణలో వెనకబడింది. 

తొలుత హ్యుండాయ్ మోటార్స్ 2016లో జరిగిన ఆటో ఎక్స్ పోలో ‘వెన్యూ’ మోడల్ కారును ఆవిష్కరించింది. గ్రిల్ అప్ ఫ్రంట్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్ విత్ ప్రొజెక్టర్ లెన్స్ అండ్ స్క్వేర్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్, టాల్ స్టాన్స్, అండ్ స్టబ్బీ బూట్ డిజైన్ కలిగి ఉన్నాయి. 

సబ్ 4 - మీటర్ ఎస్‌యూవీ విత్ మోడల్ ఫాక్స్ క్లాడింగ్ ఆన్ బంపర్స్ అండ్ సైడ్స్ ఫర్ బ్రానీ అప్పీల్, 17 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. హ్యుండాయ్ వెన్యూ మోడల్ కారు నాలుగు వేరియంట్లలో ఏడు మొనోటోన్ కల్స్, త్రీ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 

హ్యుండాయ్ వెన్యూ రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తున్నది. 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో చార్జిడ్ పెట్రోల్ మోటార్, 118 బీహెచ్పీ అండ్ 172 ఎన్ఎం ఆఫ్ పీక్ టార్చ్, డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ , 6- స్పీడ్ మాన్యువల్ ఆఫర్ అందుబాటులో ఉంది. 

1.2 లీటర్ల 4 - సిలిండర్ పెట్రోల్ మిల్ 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం ఆఫ్ పీక్ టార్చి విత్ 5 - స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ సౌకర్యం కలిగి ఉంది. 1.4 లీటర్ల 4 - సిలిండర్, టర్బో చార్జ్డ్ డిజిల్ ఇంజిన్, 89 బీహెచ్పీ, 220 ఎన్ఎం ఆఫ్ పీక్ టార్చి, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. 

అదనంగా 8- ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్, ఆర్కమ్యాస్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫ్యూరిఫయర్, వైర్ లెస్ చార్జింగ్ అండ్ వీల్ ఎయిర్ కర్టైన్స్ తదితరాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios