హ్యుండాయ్ కార్లకు యమ క్రేజీ.. ఎగుమతుల్లో టాప్

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హ్యుండాయ్ మోటార్’ ఎగుమతుల్లో తిరిగి తన మొదటిస్థానాన్ని పొందింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కార్లు, ఎస్‌యూవీ కార్ల ఎగుమతుల్లో ఇంతకుముందు మొదటి స్థానంలో ఫోర్డ్ మోటార్స్ నిలిచింది

Hyundai Motor takes the lead in car exports in April-August period

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హ్యుండాయ్ మోటార్’ ఎగుమతుల్లో తిరిగి తన మొదటిస్థానాన్ని పొందింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కార్లు, ఎస్‌యూవీ కార్ల ఎగుమతుల్లో ఇంతకుముందు మొదటి స్థానంలో ఫోర్డ్ మోటార్స్ నిలిచింది. గత ఐదు నెలల్లో హ్యుండాయ్ మోటార్ ఇండియా భారతదేశం నుంచి విదేశాలకు 71,645 కార్లు ఎగుమతి చేసింది. గతేడాదితో పోలిస్తే 23 శాతం అధికం. దానికి భిన్నంగా ఫోర్డ్ ఇండియా ఎగుమతుల్లో 12.5 శాతం పడిపోయి 65,176 యూనిట్లకు చేరుకుని రెండోస్థానంతో సరిపెట్టుకున్నది. 

హ్యుండాయ్ మోటార్స్ సంస్థ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా- పసిఫిక్ రీజియన్ల పరిధిలోని 88 దేశాలకు ఎస్‌యూవీ కార్లను ఎగుమతి చేసింది. హ్యుండాయ్ మోటార్స్ తయారుచేసిన గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ20 మోడల్ కార్లను ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కంపాక్ట్ ఎస్ యూవీ క్రెటా మోడల్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తే మిడిల్ ఈస్ట్‌లో వెర్నా సెడాన్ మోడల్ కార్లకు యమ పాపులారిటీ ఉంది. 

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ బారత్‌లోని హ్యుండాయ్ మోటార్స్ కార్యకలాపాలు దాని ప్రధాన సంస్థ హ్యుండాయ్ మోటార్స్ కార్పొరేషన్ (హెచ్ఎంసీ) గ్లోబల్ హబ్‌లో కీలకంగా మారాయన్నారు.

హ్యుండాయ్ మోటార్స్ సంస్థ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను నిరంతరం పూర్తిగా రీఫ్రెష్ చేయగా, దాని ప్రత్యర్థి ఫోర్డ్ ఇండియా కొన్ని నెలలుగా ఒక్క మోడల్ కారు కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఫ్రీ స్టైల్ ఫోర్డ్ కారును మార్కెట్ లోకి విడుదల చేయాలని ప్రణాళిక వేసుకోవడం వల్లే తమ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోయాయని తెలిపారు. 

ఇక జనరల్ మోటార్స్, నిస్సాన్ మోటార్స్, వోక్స్ వ్యాగన్, సుజుకి మోటార్స్ ఎగుమతులు తగ్గుముఫం పట్టాయి. హ్యుండాయ్ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్ కార్లు ఎక్కువగా ఎగుమతయ్యాయి. భారతదేశంలో కార్ల తయారీ సంస్థల్లో కొన్ని దేశీయంగా భారీగా తమ ఉత్పత్తులను విక్రయించగా, ఎగుమతుల్లో వెనుకబడ్డాయి.

తక్కువ వేతనాలకు కార్మికులు, మౌలిక వసతులు, విద్యుత్ వసతి అందుబాటులో ఉంటుంది. కొన్ని సంస్థలు వ్యూహాత్మక ఉత్పత్తులపై ఫోకస్ చేయడంతో దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన ఫలితాలు సాధించాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios