Asianet News TeluguAsianet News Telugu

హ్యుందాయ్ ఇండియన్ ఆయిల్ పార్ట్నర్షిప్.. ఇక పెట్రోల్ బంకుల్లో వేటింగ్ అవసరం లేదు..

హ్యుందాయ్ కంప్లీట్ రేంజ్ ఫ్యూయెల్ అండ్ పార్కింగ్ సర్వీస్ అందించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్  అండ్ పార్క్+ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్తగా ప్రారంభించిన ఇన్-యాప్ వాల్యూ-యాడెడ్ సర్వీస్ బ్లూలింక్‌లో ఇన్నోవేటిక్ ఫీచర్లు. 

Hyundai Motor India launches industry's first in-app digital service in partnership with IndianOil
Author
First Published Sep 8, 2022, 2:47 PM IST

ఇండియాలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మొట్టమొదటిసారిగా కనెక్ట్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ - బ్లూలింక్ ద్వారా ఇన్ యాప్ డిజిటల్ సర్వీస్ ప్రారంభించినట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కంప్లీట్ రేంజ్ ఫ్యూయెల్ అండ్ పార్కింగ్ సర్వీస్ అందించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్  అండ్ పార్క్+ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్తగా ప్రారంభించిన ఇన్-యాప్ వాల్యూ-యాడెడ్ సర్వీస్ బ్లూలింక్‌లో ఇన్నోవేటిక్ ఫీచర్లు.  ఇవి కస్టమర్లకు సులభమైన సేవలను ఇంకా ఫ్యూయెల్, పార్కింగ్ వంటి సర్వీస్ కోసం కాంటాక్ట్‌లెస్ పేమెంట్ ఆప్షన్ కొన్ని క్లిక్‌లలో అందిస్తుంది. 

బ్లూలింక్ ఇన్-యాప్ వాల్యూ-యాడెడ్ సర్వీస్ ప్రకటనపై హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్పొరేట్ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే వాన్ ర్యూ మాట్లాడుతూ, “బియాండ్ మొబిలిటీ” మా బ్రాండ్ ఫిలాసఫీని బలోపేతం చేస్తూ మేము మరో బలమైన చర్యను పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాము. భవిష్యత్‌లో మా కస్టమర్‌ల మొబిలిటీ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అత్యంత లేటెస్ట్ టెక్నాలజితో పాటు  ఎక్సైటింగ్ ఫీచర్‌లను అందిస్తోంది. కస్టమర్ సౌలభ్యాన్ని ఒక మెట్టుపైకి తీసుకెళ్లడం, భవిష్యత్తులో కనెక్ట్ మొబిలిటీ సొల్యూషన్‌ను అందించడం  అనే మా లక్ష్యాన్ని మేము అనుసరించాము అని అన్నారు.

ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి సతీష్ కుమార్ మాట్లాడుతూ, “ఇండియన్ ఆయిల్ ఇన్నోవేటిక్ ప్రాసెస్ అండ్ బెస్ట్ కస్టమర్ ఎక్స్పిరియన్స్ కొనసాగించడానికి కట్టుబడి ఉంది. ఈ భాగస్వామ్యం గురించి మేము సంతోషిస్తున్నాము.  మా రిటైల్ బిజినెస్ ప్రక్రియలలో డిజిటలైజేషన్ సంస్కృతిని మరింత మెరుగుపరుస్తుంది." అని అన్నారు.

యాప్‌లో వాల్యూ యాడెడ్ సర్వీస్ ఫీచర్‌ని ఉపయోగించడానికి కస్టమర్లు మొబైల్ ఫోన్‌లలో హ్యుందాయ్ బ్లూలింక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా సైన్ అప్ చేసిన తర్వాత వినియోగదారులు IndianOil అండ్ Park+ వాల్యు బేస్డ్ సర్వీస్ కి నావిగేట్ చేయబడతారు, తర్వాత అక్కౌంట్ రిజిస్ట్రేషన్, ఫ్యూయెల్ కొనుగోలు, పార్కింగ్ స్లాట్‌ బుకింగ్ యాప్‌లో వాటికి కస్టమర్లు  యాక్సెస్ చేయగలరు. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో హ్యుందాయ్ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు పెట్రోల్ బంక్ వెళ్లే ముందు నావిగేట్ చేస్తుంది, ఇంకా ఫ్యుయెల్ నింపుకోవడానికి ముందుగానే పేమెంట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ భాగస్వామ్యం ఇండియన్‌ఆయిల్‌కు ప్రత్యేక కస్టమర్ బేస్‌ను కూడా అందిస్తుంది ఇంకా పెట్రోల్ బంక్ వద్ద వేటింగ్ సమయాన్ని తగ్గిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios