ఇక పల్లెల్లోకి ‘హ్యుండాయ్’ డిజిటల్ క్యాంపెయిన్

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తన ఉత్పత్తుల విక్రయం పెంపొందించుకునేందుకు గ్రామాల్లో డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భారతదేశంలో స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ తొలుత చూపిన సంస్థగా హ్యుండాయ్ మోటార్స్ నిలువనున్నది.

Hyundai digital float campaign

హైదరాబాద్: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తన కార్ల విక్రయాన్ని పెంపొందించుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తాము కొత్తగా అందుబాటులోకి తెచ్చిన వాహనాలపై దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణులకు కూడా అవగాహన కల్పించాలని  హ్యుండాయ్ మోటార్స్ నిర్ణయించింది. 

ఇందులో భాగంగా సంస్థ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఎన్‌ఐయాస్‌, క్రెటా వాహనాలపై హ్యుండాయ్ డిజిటల్‌ క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ రెండు కొత్త మోడల్‌ వాహనాల్లో ఉన్న పలు సౌకర్యాలను ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్‌ను చేపట్టనుంది. 

also read బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్ : KTM 390 అడ్వెంచర్ 2020

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన గ్రామాలకు క్యాంపెయిన్‌ను చేర్చేలా ఏర్పాటు చేసిన ఈ డిజిటల్‌ ఫ్లోట్స్‌ను హ్యుండాయ్ రీజినల్‌ మేనేజర్‌ సలీమ్‌ అమీన్‌, ఆర్‌పీఎస్‌ఎం సంజీవ్‌ కుమార్‌ ప్రారంభించారు. 

Hyundai digital float campaign

నియోస్ మోడల్‌లో రేర్ ఏసీ వెంట్స్, వైర్ లైస్ చార్జర్, డిజిటల్ స్పీడో మీటర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో తొలి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా హ్యుండాయ్ మోటార్స్ కంపెనీ నిలువనున్నది.

also read కియా ‘సెల్టోస్’ నో ‘హాల్టింగ్స్’: అక్టోబర్‌లో 12,800 సేల్స్

దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ కార్ల తయారీ సంస్థ. తన ఉత్పత్తుల విక్రయానికి రెండేళ్ల క్రితమే గ్రామీణ మార్కెట్లపై ద్రుష్టిని కేంద్రీకరించింది. 418 గ్రామీణ ప్రాంతాలను ఇందుకోసం గుర్తించిన హ్యుండాయ్ మోటార్స్ ‘ఎక్స్ పీరియన్స్ హ్యుండాయ్’ పేరిట ప్రచారం చేపట్టింది. 

కారవాన్ ఆఫ్ హ్యుండాయ్ కార్ల ఆధ్వర్యంలో గ్రామీణ మార్కెట్లలోని కస్టమర్లతో అనుసంధానం కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది హ్యుండాయ్ మోటార్స్. ఈ ప్రచారోద్యమంలో హ్యుండాయ్ టీమ్స్ ఇళ్లు, మార్కెట్లు, బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీల మీదుగా సాగుతాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios