Hydrogen Fuel Electric Vehicle: ఒకసారి ఛార్జింగ్‌తో 650 కి.మీ ప్రయాణం.. ఆవిష్కరించిన కేంద్ర మంత్రి..!
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సహకారంతో ప్రపంచంలోని అత్యంత అధునాతన FCEV టయోటా మిరాయ్‌ను అధ్యయనం చేయడానికి, అంచనా వేయడానికి పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.
దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్ టయోటా మిరాయ్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. పూర్తి పర్యావరణహితంగా ఈ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని టయోటా రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 650 కి.మీ ప్రయాణించవచ్చు. కేవలం 5 నిమిషాల్లో రీఫ్యూయలింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2014లో ఆవిష్కరించిన టయోటా మిరాయ్‌లో 2 వ తరానికి చెందిన వాహనం ఇది. దేశంలోనే తొలి హైడ్రోజన్ కారు బుధవారం రాజధాని ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్ ఆధారిత మోడరన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FCEV) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఈ కారులో 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
ఈ కారును తక్కువ ఖర్చుతో నడపవచ్చని పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ సందర్భంగా నితిన్ గడ్కరీ తెలిపారు. భవిష్యత్తులో మన దేశంలో హైడ్రోజన్ స్టేషన్లు ఏర్పాటవుతాయని, అప్పుడు ఒక్క రూపాయికే రెండు కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అన్నారు. కిలో హైడ్రోజన్ ధర దాదాపు ఒక డాలర్ ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా దాదాపు 70 రూపాయలకే 120 కి.మీ. దూరం నిర్ణయించవచ్చు. హైడ్రోజన్ కార్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని.. ఇప్పుడు ఈ దిశగా పనులు వేగంగా జరుగుతాయని ఆయన తెలిపారు.
ఒక కిలో హైడ్రోజన్‌తో 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని ట్యాంక్ 6.2 కిలోల కెపాసిటీ. అంటే ఒకసారి ట్యాంక్ నిండితే కారు దాదాపు 650 కి.మీ. వరకు నడపవచ్చు. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సహకారంతో ప్రపంచంలోని అత్యంత అధునాతన FCEV టయోటా మిరాయ్‌ను అధ్యయనం చేయడానికి, అంచనా వేయడానికి పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇది భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులలో హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఈ కారు పేరు టొయోటా మిరాయ్. దేశంలో హైడ్రోజన్, ఎఫ్‌సిఇవి టెక్నాలజీ, హైడ్రోజన్ ఆధారిత సొసైటీలకు సహాయపడే విధంగా దీన్ని రూపొందించారు.