మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్స్.. రూ. 74వేల వరకు బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే ఛాన్స్

మారుతి సుజుకి జూలై నెలలో  కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఆఫర్ ఈ నెల పొడవునా వర్తిస్తుంది అయితే మారుతి సుజుకి అరేనా బ్రాండ్ క్రింద విక్రయించే మోడళ్లకు మాత్రమే ఆఫర్ పరిమితం చేసింది. 

Huge discounts on these cars of Maruti Suzuki, you will get bumper discount of up to Rs 74,000

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా (maruti suzuki) కస్టమర్లను ఆకర్షించడానికి,  సేల్స్ పెంచుకోవడానికి ఆకర్షణీయమైన ఆఫర్‌లతో ముందుకు వచ్చింది. మారుతి సుజుకి జూలై నెలలో  కార్ల కొనుగోలుపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఆఫర్ ఈ నెల పొడవునా వర్తిస్తుంది అయితే మారుతి సుజుకి అరేనా బ్రాండ్ క్రింద విక్రయించే మోడళ్లకు మాత్రమే ఆఫర్ పరిమితం చేసింది. మారుతీ సుజుకి కార్పొరేట్, క్యాష్ అండ్ ఎక్స్ఛేంజ్ బోనస్ స్కీమ్ కింద డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో కవర్ చేయబడిన మోడల్‌లలో మారుతి ఆల్టో, S-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా అండ్ ఈకో ఉన్నాయి. మొత్తం మీద  కస్టమర్లు మోడల్ అండ్ వేరియంట్ ఆధారంగా రూ.74,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మారుతి ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో  చూద్దాం..

మారుతి ఆల్టో
మారుతి సుజుకి  ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి ఆల్టో 800 పై రూ. 31,000 తగ్గింపును అందిస్తోంది.  

మారుతీ S-Presso
మారుతీ S-Presso మోడల్‌పై మొత్తం  రూ.31,000 తగ్గింపును అందిస్తోంది.  

మారుతీ స్విఫ్ట్
మారుతి  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్‌పై మొత్తం రూ.32,000 తగ్గింపును అందిస్తోంది.  

మారుతి డిజైర్
మారుతి  సబ్-కాంపాక్ట్ సెడాన్ కారు మారుతి డిజైర్ పై మొత్తం రూ.34,000 తగ్గింపును అందిస్తోంది.  

మారుతి ఈకో 
మారుతి ఈకోపై మొత్తం రూ.36,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 10,000 క్యాష్ అండ్ రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. దీనితో పాటు రూ.4,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంటుంది. 

మారుతి సెలెరియో
మారుతి  తాజాగా విడుదల చేసిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.51,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 క్యాష్, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది.

మారుతీ వ్యాగన్ఆర్
మారుతి  అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ మారుతి వ్యాగన్ఆర్  పై గరిష్టంగా రూ.74,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అలాగే 1.0-లీటర్ ఇంజన్ మోడల్‌పై రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. మరోవైపు, 1.2-లీటర్ ఇంజిన్ మోడల్‌లో రూ. 10,000 క్యాష్ తగ్గింపు, రూ. 6,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios