Asianet News TeluguAsianet News Telugu

హోండా అమ్మకాల్లో అమేజింగ్ రికార్డ్: మూడు నెలల్లోనే 30 వేల కార్లు సేల్

హోండా కారు సంస్థ కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన ‘న్యూ అమేజ్’ మూడు నెలల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది. 30 వేలకు పైగా అమేజ్ మోడల్ కార్ల అమ్మకాలే కాదు.. మొత్తం సంస్థ కార్ల విక్రయాల్లో పురోగతి సాధించడానికి కారణమైంది.
 

Honda's new Amaze records 30k unit sales in 3 months
Author
Hyderabad, First Published Aug 23, 2018, 11:36 AM IST

హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) మూడు నెలల క్రితం కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన సెడాన్ ‘అమేజ్’ మోడల్ విక్రయాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పొంది. మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే 30 వేలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. దీంతో హోండాకారు మోడల్స్‌లో ఇదే అత్యుత్తమమని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌సీఐఎల్ ఏర్పాటైన 20 ఏళ్లలో ఇదే అత్యుత్తమమని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మాకోటో హ్యుండా చెప్పారు.న్యూ ‘అమేజ్’ మోడల్ కారును నూతన వేదికపై సెడాన్‌గా అభివ్రుద్ధి చేసి తీర్చిదిద్దామని తెలిపారు. తమ ప్రయత్నానికి వినియోగదారుల నుంచి అభినందనలు వస్తున్నాయని, కారు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారని మాకోటో హ్యుండా తెలిపారు. 

అమేజ్‌తో 12.5 శాతం పురోగతి నమోదు


న్యూ అమేజ్ రంగ ప్రవేశంతో ఏప్రిల్ - జూలై మధ్య తమ సంస్థ కార్ల విక్రయాల్లో 12.5 శాతం పురోగతి నమోదైందని హెచ్‌సీఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 55,647 కార్ల విక్రయాలు జరిగితే ఈ ఏడాది 62,579 కార్లు అమ్మినట్లు పేర్కొంది. భారతదేశంలోని హోండా తొలిసారి ఆల్ న్యూ అమేజ్ మోడల్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేసినట్లు తెలిపింది.అంతే కాదు తొలి డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ (సీవీటీ) వారియంట్‌గానూ నిలిచింది. గత మే నెలలో న్యూ అమేజ్ మోడల్ కారును మార్కెట్‌లో ఆవిష్కరించిన తర్వాత హోండా కార్లకు చెందిన అన్ని రకాల పెట్రోల్ సీవీటీ (కంట్యూనియస్లీ వ్యారిబుల్ ట్రాన్స్ మిషన్), డీజిల్ సీవీటీ మోడల్ వాహనాలు 30శాతం పెరిగాయని తెలిపింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios