భారత మార్కెట్లో ‘హోండా’న్యూ సిటీ జడ్‌ఎక్స్ ఎంటీ

హోండా కార్స్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ మోడల్‌ సిటీ కార్ల మోడల్  కొత్త వేరియంట్‌ను భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు రూ.12.75 లక్షలకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

Honda City ZX MT Petrol Variant Launched In India

హోండా కార్స్‌ ఇండియా తమ మధ్య స్థాయి సెడాన్‌ మోడల్‌ సిటీ కార్ల మోడల్  కొత్త వేరియంట్‌ను భారతదేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు రూ.12.75 లక్షలకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ‘జడ్‌ఎక్స్‌ ఎంటీ’అనే మోడల్‌తో మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త వేరియంట్‌ కారులో 1.5 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇందులో మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వసతి కూడా ఉంది.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌, ఆటోమేటిక్‌ హెడ్‌లైట్లు, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు, వెనక పార్కింగ్‌ సెన్సార్లు వంటి అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన పెట్రోల్‌ వేరియంట్‌ కోసం వినియోగదారుల నుంచి అధిక డిమాండ్‌ రావడంతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది.

కొత్త రంగుల్లో మోడల్‌ను తీసుకురావడం, కొత్త ఫీచర్లతో సిటీ మోడల్‌ మరింత బలోపేతం కానుందని హోండా కార్స్‌ ఇండియా అమ్మకాలు, మార్కెటింగ్ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ కం డైరెక్టర్‌  రాజేశ్‌ గోయల్‌ అన్నారు. 1998 జనవరిలో హోండా తొలిసారిగా సిటీ మోడల్‌ను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ 7.5 లక్షలకు పైగా సిటీ కార్లను అమ్మింది.

ప్రస్తుతం నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉన్న హోండా సిటీ కారు.. ఎస్వీ, వీ, వీఎక్స్, న్యూ జడ్ ఎక్స్ ట్రిమ్ మోడల్ కార్లు పెట్రోల్ గానీ, డీజిల్ వేరియంట్లలో లభిస్తాయి. నూతన హోండా సిటీ మోడల్ కార్లు మారుతి సుజుకి సియాజ్, హ్యుండాయ్ వెర్నా, వోక్స్ వ్యాగన్ వెంట్రో వంటి కార్లను మార్కెట్లో ఢీకొట్టనున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios