ఆటోమేజర్ హోండా కార్స్ ఇండియా వచ్చే మూడేళ్లలో యావత్ తన సేల్స్ నెట్‌వర్క్‌ను రీవాంప్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. డీలర్ల భాగస్వామ్యం, సహకారంతో రూ.270 కోట్లు ఖర్చు చేయాలని హోండా కార్స్ ఇండియా ప్రణాళికలు రూపొందించింది. వచ్చే మూడేళ్లలో 400కి పైగా డీలర్‌షిప్‌లను సంపాదించుకుని భారతదేశంలో కార్పొరేట్ గుర్తింపును కూడా సంపాదించుకోవాలని అభిలషిస్తోంది. 

నూతన ప్రాంతాల్లో ఔట్ లెట్లు తెరవడంతోపాటు, ఇప్పటికే కొనసాగుతున్న డీలర్‌షిప్‌లను పునర్వ్యవస్థీకరించనున్నామని హోండా కార్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేశ్ గోయల్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యావత్ నెట్‌వర్క్‌ను మోడర్నైజ్ చేయాలని భావిస్తున్నామన్నారు.

కస్టమర్లతో రిటైల్ ఎక్స్ పీరియన్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఐడియా కూడా అమలులో ఉన్నదన్నారు. తద్వారా హోండా కార్స్ బ్రాండ్ ప్రీమియం ప్రాధాన్యాన్ని వినియోగదారులు గుర్తించేలా చేయడమే తమ లక్ష్యమని హోండా కార్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేశ్ గోయల్ చెప్పారు. 

ప్రోగ్రెసివ్‌ ద్రుక్పథంతో 350 నూతన డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు 70 పాత డీలర్ షిప్ లను పూర్తిగా రీవాంప్ చేయడానికి తగు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఇన్సియేటివ్‌లో పెట్టుబడులు సమీకరించాలన్న లక్ష్యం కూడా దాగి ఉన్నదని రాజేశ్ గోయల్ తెలిపారు. 

ఒక్కో డీలర్‌షిప్ వద్ద రూ.60 లక్షల నుంచి రూ. 1.10 కోట్లు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా ఉన్నట్లు హోండా కార్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజేశ్ గోయల్ తెలిపారు. హోండా కార్స్ ప్రొడక్ట్స్.. సిటీ, అమేజ్ సెడాన్ తదితర మోడల్ కార్లు ప్రజాదరణ పొందాయి.