Honda Activa:హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్.. గోల్డ్ లోగో, కొత్త కలర్ స్కీమ్, ధర, ఫీచర్లు చూసారా..?

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. గోల్డ్ వీల్స్, ఎంబ్లమ్ పై బంగారు లోగో ఇంకా ఇప్పుడు బంగారు రంగులో ఫ్రంట్ క్రోమ్ గార్నిష్‌ పొందుతుంది. సైడ్ కి యాక్టివా బ్యాడ్జింగ్‌ గోల్డెన్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

Honda Activa Premium Edition launched, know the price, features and changes

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ టీజర్‌ను విడుదల చేసిన ద్విచక్ర వాహన సంస్థ హోండా ఎట్టకేలకు రూ.75,400 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొత్త ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర DLX వేరియంట్ కంటే రూ. 1,000 అలాగే STD వేరియంట్ కంటే రూ. 3,000 ఎక్కువ. Activa ప్రీమియం ఎడిషన్ ధర కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది. 

కొత్త లుక్ అండ్ డిజైన్
హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. గోల్డ్ వీల్స్, ఎంబ్లమ్ పై బంగారు లోగో ఇంకా ఇప్పుడు బంగారు రంగులో ఫ్రంట్ క్రోమ్ గార్నిష్‌ పొందుతుంది. సైడ్ కి యాక్టివా బ్యాడ్జింగ్‌ గోల్డెన్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. లోపలి బాడీ, ఫుట్‌బోర్డ్ అండ్ సీటు ఇప్పుడు బూడిద రంగులో ఉంటాయి. ఈ మార్పులన్నీ స్టాండర్డ్ యాక్టివాకు మరింత ప్రీమియం ఇంకా అప్-మార్కెట్ రూపాన్ని అందిస్తాయి.

కలర్ ఆప్షన్స్
హోండా మూడు కొత్త రంగులలో ప్రీమియం ఎడిషన్‌ను అందిస్తుంది. ఇందులో మాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ ఉన్నాయి. కొనుగోలుదారులు ఏ కలర్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నా మూడు షేడ్స్‌లో గోల్డ్ అసెంట్స్ పొందుతారు. 

ఇంజిన్ అండ్ పవర్
హార్డ్‌వేర్, ఇంజిన్ స్పెసిఫికేషన్‌లు ఇంకా ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు.  అదే 109.51cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఇచ్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 rpm వద్ద 7.68 bhp శక్తిని, 5,500 rpm వద్ద 8.84 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ CVTతో వస్తుంది. 

ఫీచర్ల విషయానికొస్తే స్కూటర్‌లో ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అండర్-సీట్ స్టోరేజ్, LED హెడ్‌ల్యాంప్‌లు, ESP టెక్నాలజీతో స్కూటర్ సైలెంట్ స్టార్ట్‌లో సహాయపడుతుంది. ఇంజిన్‌లోకి ఫ్యూయెల్ ఇంజెక్ట్ చేయబడుతుంది ఇంకా ఫ్యాన్ ద్వారా చల్లబడుతుంది. 

హార్డ్‌వేర్ పరంగా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి, యాక్టివా ప్రీమియం ఎడిషన్ ట్యూబ్‌లెస్ టైర్లు, స్టీల్ రిమ్‌లతో వస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు ఇంకా వెనుక రెండింటిలోనూ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. స్కూటర్‌కి ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు, పంక్చర్ అయినప్పుడు రైడర్‌కు కాస్త ఇబ్బందిని తగ్గిస్తుంది. సస్పెన్షన్ డ్యూటీస్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 3-స్టెప్స్ అడ్జస్ట్ స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌ల ద్వారా నిర్వహించబడతాయి. స్కూటర్ బరువు 106 కిలోలు, 5.3 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ లభిస్తుంది. యాక్టివా సీట్ ఎత్తు 692 mm.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios