Honda Activa 7G:కొత్త జనరేషన్ మోడల్.. ఆన్ లైన్ లో టీజర్.. త్వరలోనే లాంచ్..

ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సరికొత్త స్కూటర్‌ను లాంచ్  చేయనుంది. HMSI మంగళవారం హోండా యాక్టివా  కొత్త జనరేషన్ మోడల్‌గా కనిపించే టీజర్‌ను షేర్  చేసింది.

Honda Activa 7G: New-generation model of Honda Activa teaser released will be launched soon

ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI)తాజాగా ఇండియాలో కొత్త CB300F బైక్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ కొత్త స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. హోండా యాక్టివా కొత్త జనరేషన్ మోడల్‌గా కనిపించే స్కూటర్ ముందు భాగం టీజర్‌ను మంగళవారం HMSI షేర్ చేసింది. తయారీ సంస్థ మోడల్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కొత్త స్కూటర్ 'ఇతర వాటి కంటే స్టైలింగ్ స్కేల్‌ ఎక్కువగా పెంచుతుందని' చెప్పింది.

నివేదికల ప్రకారం, కొత్త స్కూటర్ హోండా యాక్టివా 7G మోడల్ కావచ్చు. యాక్టివా 7G స్కూటర్ రెండు సంవత్సరాల క్రితం 6G మోడల్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి ద్విచక్ర వాహన తయారీ సంస్థ నుండి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్‌లలో ఒకటి. Activa ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. హోండా 2020 నుండి ఇండియాలో Activa 6G మోడళ్లను విక్రయిస్తుంది. అంతేకాకుండా, కంపెనీ హోండా యాక్టివా 125, గ్రాజియా 125, డియో వంటి ఇతర మోడళ్లను కూడా విక్రయిస్తుంది. 

యాక్టివా 7Gగా భావిస్తున్న హోండా కొత్త స్కూటర్ స్టాండర్డ్, స్పోర్ట్స్ అండ్ నార్మల్ వంటి మూడు వేరియంట్‌లలో అందించనుంది.  కంపెనీ ప్రయత్నించిన అండ్ పరీక్షించిన 110cc ఫ్యాన్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్‌ యాక్టివా 7Gలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.68 bhp శక్తిని, 8.79 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. యాక్టివా 6G మోడల్‌తో పోలిస్తే కొత్త జనరేషన్ మోడల్‌కు అప్ డెటెడ్ LED హెడ్‌లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇతర ఫీచర్లు లభిస్తాయని కూడా భావిస్తున్నారు.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రాబోయే స్కూటర్ గురించి ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. ఒకవేళ యాక్టివా మోడల్ అయితే, టీజర్ పిక్చర్ లో ఎలాంటి డిజైన్ మార్పులను వెల్లడించలేదు. ద్విచక్ర వాహన తయారీ సంస్థ  కూడా ఎలాంటి లాంచ్ టైమ్‌లైన్‌ను తెలపలేదు. అయితే  పండుగ సీజన్‌కు ముందే లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 

అంతకుముందు సోమవారం, హోండా CB300F బైక్ ను రూ. 2.26 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదల చేసింది. బైక్ 10 కొత్త పేటెంట్ అప్లికేషన్‌లతో పాటు లేటెస్ట్ ఆయిల్-కూల్డ్ టెక్నాలజీతో 293cc, 4-వాల్వ్ SOHC ఇంజిన్‌తో శక్తిని పొందింది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు సాఫీగా ప్రయాణించడానికి సరైన గేర్ రేషియో పొందుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios