మార్కెట్ లోకి ఫోర్డ్ ‘ఆస్పైర్’.. ప్రైస్ జస్ట్ రూ.6.27 లక్షలే
అమెరికా ఆటోమొబైల్ మేజర్ ‘ఫోర్డ్ ఇండియా’ సీఎన్జీ వర్షన్ ఆస్పైర్ సెడాన్ కారును విపణిలోకి ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో లభిస్తున్న ఆస్పైర్ ధర.. ఆస్పైర్ అబియెంట్ ధర రూ.6.27 లక్షలుగానూ, ట్రెండ్ ప్లస్ ధర రూ.7.12 లక్షలకు లభిస్తుంది.
న్యూఢిల్లీ: అమెరికా ఆటో మేజర్ ‘ఫోర్ట్ ఇండియా’ కర్బన ఉద్గారాలపై ద్రుష్టి సారించింది. తన కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు ‘ఆస్పైర్’లో సీఎన్జీ వర్షన్ మోడల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఆస్పైర్ అబియెంటె వేరియంట్ కారు ధర రూ.6.27 లక్షలు పలుకుతుండగా, ట్రెండ్ ప్లస్ 7.12 లక్షలకు అందుబాటులో ఉంది.
ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా స్పందిస్తూ.. వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కారు పనితీరు, సేఫ్టీలో రాజీకి తావులేని విధంగా అస్పైర్ సీఎన్జీ మోడల్ కారును ఆవిష్కరించామన్నారు.
సీఎన్జీ కిట్‌కు కార్ల కొనుగోలుదారులకు డీలర్ల వద్ద సుశిక్షితులైన నిపుణులు అందజేస్తారు. ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా సీఎన్జీ మోడల్ ఆస్పైర్ కారును గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ జిల్లాలోని యూనిట్ నుంచి ఉత్పత్తి చేస్తోంది.
ఫోర్డ్, మహీంద్రా సంస్థల మధ్య భాగస్వామ్యం మరింత విస్త్రుతమవుతోంది. ఇంజిన్ నుంచి ఎస్ యూవీ, సెడాన్లు, విద్యుత్ కార్ల తయారీ వరకు రెండు సంస్థలు పరస్పరం సహకరించుకోనున్నాయి.
అందులో భాగంగా 2020 చివరి నాటికి చౌక ధరకే భారతీయులకు కంపాక్ట్ సెగ్మెంట్‌లో ఎస్ యూవీ కారును అందుబాటులోకి తేనున్నది. ఫోర్డ్ సీ-ఎస్‌యూవీ మోడల్ కారు మహీంద్రా ఎక్స్ యూవీ 500 మోడల్ కారును పోలి ఉంటుంది.
ఫోర్డ్ సీ-ఎస్‌యూవీ మోడల్ కారు లార్జ్ కౌల్ మాదిరిగా ఉండటంతోపాటు వైడ్ ఫోర్డ్ గ్రిల్లె, స్లెండర్, హై మౌంటెడ్ హెడ్ ల్యాంప్స్, ఫ్లెష్డ్ ఔట్ వీల్ ఆర్చెస్, లార్జర్ అండ్ వైడర్ వీల్స్, ఎల్ఈడీ లైట్స్ అమర్చారు. సిక్స్ నుంచి సెవెన్ సీటర్ ఫెసిలిటీతో కారును విపణిలోకి విడుదల చేసే ఆలోచనలో ఫోర్డ్ ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ఫోర్డ్‌పై తీవ్ర ప్రభావం చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ బాబ్ షాంక్స్ ఈ ఏడాది చివరికల్లా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది ద్వితీయార్థంలో బాబ్ షాంక్స్ తన రిటైర్మెంట్ ప్లాన్ బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తున్నది. 1977లో ఫోర్డ్ కార్స్‌లో చేరిన బాబ్ షాంక్స్ 2012 ఏప్రిల్ నుంచి ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు.