భారతదేశంలో ఎగిరే కారు?: సుజుకీ, స్కైడ్రైవ్‌ కలిసి 'ఎగిరే కార్ల' తయారీకి ఒప్పందం

జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్ప్ అండ్ 'ఫ్లయింగ్ కార్' సంస్థ స్కైడ్రైవ్ ఇంక్ మంగళవారం ఎలక్ట్రిక్, వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించాయి.
 

flying car in india? suzuki signs deal with flying car firm skrdrive

ఎలక్ట్రిక్, వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల పరిశోధన, అభివృద్ధి ఇంకా మార్కెటింగ్‌లో  ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జపాన్ ఆటోమేకర్ సుజుకీ మోటార్ కార్ప్ (suzuki motor corp) అండ్ 'ఫ్లయింగ్ కార్' సంస్థ స్కైడ్రైవ్ ఇంక్ (skydrive inc) మంగళవారం తెలిపాయి. 

కొత్త మార్కెట్లను తెరవడానికి కూడా కృషి చేస్తామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఇందులో ఆటోమొబైల్ మార్కెట్‌లో సుజుకి దాదాపు సగం వాటా ఉన్న భారతదేశంపై మొదట  దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను ఉత్పత్తి చేయడానికి  భారతీయ కర్మాగారంలో 1.37 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సుజుకి  ప్రకటించింది.

అయితే ఈ కంపెనీల  భాగస్వామ్యంలో పెట్టుబడుల వివరాలను వెల్లడించలేదు ఇంకా ఉత్పత్తి లేదా లక్ష్యాలను వివరించలేదు. 2018లో స్థాపించబడిన టోక్యో ప్రధాన కార్యాలయంగా   ఉన్న స్కైడ్రైవ్  ప్రధాన వాటాదారులలో ట్రేడింగ్ హౌస్ ఇటోచు కార్ప్., టెక్ ఫర్మ్ NEC కార్పొరేషన్ అండ్ ఎనర్జీ కంపెనీ ఎనోస్ హోల్డింగ్స్ ఇంక్. వంటి పెద్ద జపాన్ వ్యాపారాలు ఉన్నాయి.

ఒక వెబ్‌సైట్ ప్రకారం, 2020లో సిరీస్ B ఫండ్స్‌లో మొత్తం 5.1 బిలియన్ యెన్ (42 మిలియన్ డాలర్లు)ను సేకరించింది. స్కైడ్రైవ్ ప్రస్తుతం పూర్తి స్థాయి ఉత్పత్తి కోసం ప్రణాళికలతో కాంపాక్ట్, టూ-సీటర్ ఎలక్ట్రిక్ పవర్డ్ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తోంది.

ఈ ప్రత్యేక వాహనంపై సుజుకి పని చేస్తుందో లేదో ప్రకటనలో చెయలేదు. కార్గో డ్రోన్‌లను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి ఒసాకాలో 'ఫ్లయింగ్ కార్' సర్వీసును ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్ నగరం ఒసాకా 2025లో వరల్డ్ ఎక్స్‌పోకు ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ భాగస్వామ్యంలో ఆటోమొబైల్స్, బైక్స్, ఔట్‌బోర్డ్ మోటార్లు కాకుండా సుజుకికి నాల్గవ మొబిలిటీ వ్యాపారంగా 'ఫ్లయింగ్ కార్లు' కూడా ఉంటుందని ఒక ప్రకటన తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios