ఫియట్ జీప్ కంపాస్ వాహనాల రీకాల్...

ఫియట్ క్రిస్టర్ ఆటోమొబైల్స్ (ఎఫ్ సీఏ) తమ జీప్ కంపాస్ ఎస్‌యూవీ మోడల్ కార్లను రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 డిసెంబర్ 18 నుండి 2018 నవంబర్ 30 మధ్య కొనుగోలు చేసిన 11,002 కార్లలో పవర్ ట్రైన్ కంట్రోల్ మాడ్యూల్ (పీసీఎం) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాల్సి ఉన్నదని తెలిపింది. 
 

FCA India recalls 11,002 Jeep Compass units to update engine software

తమ ఎస్‌యూవీ జీప్ కంపాస్‌కు చెందిన 11,002 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సీఏ) ఇండియా ప్రకటించింది. వాటిల్లో పవర్‌ట్రైన్ కంట్రోల్ మాడ్యుల్ (పీసీఎం) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాల్సి ఉన్నదని సంస్థ స్పష్టం చేసింది. వచ్చే నెల మొదటి వారం నుంచి రీకాల్ మొదలవుతుందని ఎఫ్‌సీఏ పేర్కొన్నది. 

2017 డిసెంబర్ 18 నుంచి 2018 నవంబర్ 30 మధ్య రెండు లీటర్ల సామర్థ్యం కలిగిన డీజిల్ ఇంజిన్లతో తయారైన టూ-వీల్ డ్రైవ్ వెర్షన్ మోడల్‌లోనే ఈ లోపాలున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. పెట్రోల్ మోడల్స్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. కాగా, లోపం సరిచేయడానికి దాదాపు 15 నిమిషాల సమయం పడుతుందని, దీన్ని సరి చేయడానికి కస్టమర్లు ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదని సంస్థ చెప్పింది. 

కాలుష్య కారక సమస్యను సరిదిద్దేందుకు పీసీఎం సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. తమ జీప్ కంపాస్ మోడల్ కార్లను కొనుగోలు చేసిన వారు తమ డీలర్లను నేరుగా సంప్రదించాలని పీయట్ సూచించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios