Asianet News TeluguAsianet News Telugu

ఫెస్ ఆన్ లాక్ తో డోర్ ఓపెన్ ఇంకా ఇన్స్టంట్ ఛార్జింగ్ కూడా ! కంపెనీ మొదటి కారు ఇదిగో!

Xiaomi SU7 సెడాన్‌ను చైనాలో విక్రయించడానికి కంపెనీ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసింది. కంపెనీ  మొదటి ఎలక్ట్రిక్ కారు  కొన్ని ఫోటోలను  కూడా షేర్ చేసింది. కొత్త Xiaomi SU7ను బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్ట్ కింద తయారు చేస్తుంది. 
 

Face unlocks the door and charging is instant! Here is Xiaomi's first car-sak
Author
First Published Nov 18, 2023, 6:32 PM IST | Last Updated Nov 18, 2023, 6:32 PM IST

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ  తొలి ఎలక్ట్రిక్ కారుని  చైనాలో విడుదల చేసింది. దీనిని SU7 అని పిలుస్తారు. ఈ కారు ఎలక్ట్రిక్ సెడాన్ కార్. కంపెనీ Xiaomi SU7 రెండు వెర్షన్లను ప్రదర్శించింది. Xiaomi SU7 సెడాన్‌ను చైనాలో విక్రయించడానికి కంపెనీ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేసింది. కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు కొన్ని ఫోటోల్లను కూడా షేర్ చేసింది. కొత్త Xiaomi SU7 ను బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్ట్ కింద తయారు చేస్తుంది. 

ఈ కారు వివిధ సందర్భాలలో టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. దీనికి గతంలో MS11 అనే కోడ్ నేమ్ ఉండేది. కొత్త ఫోటోలతో పాటు, ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సమాచారం కూడా వెల్లడైంది.  

చైనాలోని ప్రతి కారు మార్కెట్లోకి రావాలంటే ముందుగా లోకల్  రెగ్యులేటర్ ఆమోదం పొందాలి. అలాగే ప్రతి నెల పరిశ్రమ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) హోమోలోగేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లే వాహనాల లిస్ట్  విడుదల చేస్తుంది. ఈ డాకుమెంట్స్ ప్రకారం, Xiaomi SU7 సెడాన్ పొడవు 4997 mm. వెడల్పు 1,963 mm. ఎత్తు 1455 mm. వీల్‌బేస్ 3000 mm. కార్ న్యూస్ చైనా  నివేదిక ప్రకారం  19-అంగుళలు, 20-అంగుళాలు రెండు  వీల్ సైజు అప్షన్స్ ఉంటాయి. 

Face unlocks the door and charging is instant! Here is Xiaomi's first car-sak

ఫోటోలో దాని B-పిల్లర్‌పై అమర్చబడిన కెమెరాను చూడవచ్చు. దీని ప్రకారం, Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్ ఫేషియల్ రికగ్నిషన్ లాక్/అన్‌లాక్ సిస్టమ్‌తో  ఉంటుందని భావించవచ్చు. అంటే మీరు కారు ముందుకి వచ్చినప్పుడు, ఈ కెమెరా మీ ముఖాన్ని గుర్తించి, కారుని అన్‌లాక్ చేస్తుంది. అయితే ఇంకా అధికారికంగా వెరిఫై  కాలేదు. 

ఎలక్ట్రిక్ సెడాన్ వివిధ పవర్‌ట్రెయిన్ అప్షన్లతో  మార్కెట్లోకి విడుదల చేయబడుతుందని తెలిపారు. ఒక వేరియంట్ 220 kW మోటార్‌తో రేర్ వీల్  డ్రైవ్ సిస్టమ్ (RWD), 495 kW మోటార్‌తో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ (AWD)తో అందించబడుతుంది. కంపెనీ బేస్ వేరియంట్‌లో LFP బ్యాటరీ ప్యాక్‌ను అందించవచ్చు. 

దీని ఎలక్ట్రిక్ మోటార్ యునైటెడ్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ తో  తయారు చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారు   ప్రత్యేకత ఏమిటంటే   ETC ఫంక్షన్‌తో వస్తుంది. ఈ ఫీచర్  చాలా ఉపయోగకరమైన ఫీచర్. వాహనాన్ని ఆపకుండానే టోల్ రోడ్లపై ఆటోమేటిక్‌గా టోల్ చెల్లించేందుకు డ్రైవర్లకు  ఈ సిస్టమ్ సహాయపడుతుంది.  

Face unlocks the door and charging is instant! Here is Xiaomi's first car-sak

ఈ కారు  ఐదు సీట్ల సెడాన్ కారు. నివేదికల ప్రకారం, దీని బేస్ మోడల్ బరువు 1,980 కిలోలు, టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ. టాప్ మోడల్ బరువు 2,205 కిలోలు, టాప్ స్పీడ్ గంటకు 265 కిమీ. 

Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్ ఉత్పత్తి వచ్చే నెల డిసెంబర్ నుండి ప్రారంభమవుతుంది.  సేల్స్  అండ్  డిస్ట్రిబ్యూషన్  ఫిబ్రవరి 2024 నుండి మొదలవుతుంది. ఈ కారు  Xiaomi  మొదటి ఎలక్ట్రిక్ కారు. 2021లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ కారుకు సంబంధించిన మొత్తం సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఈ వాహనం ముందుగా చైనా మార్కెట్‌లోకి  రానుంది. కారు భారీ ఉత్పత్తి డిసెంబర్ 2023లో, డెలివరీలు ఫిబ్రవరి 2024లో ప్రారంభమవుతాయి. బయాక్  బీజింగ్ ఫ్యాక్టరీ ఇప్పటికే ట్రయల్ ప్రొడక్షన్ రన్ ప్రారంభించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios