ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కొత్త లగ్జరీ కార్.. కోట్లలో ధర.. దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

జి‌ఎల్‌ఎస్  అనేది జర్మన్ కంపెనీ  ఫ్లాగ్ షిప్ SUV. సూర్యకుమార్ మెర్సిడెస్-బెంజ్ SUV ఫ్రంట్ గ్రిల్  భిన్నంగా ఉన్నందున AMG కిట్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. 

Cricketer Suryakumar Yadav bought this luxury car from Mercedes-Benz, its  price is in crores

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కొత్త  Mercedes-Benz GLS ఎస్‌యూ‌విని కొనుగోలు చేశాడు. ఇండియన్ మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.16 కోట్లు. GLS అనేది జర్మన్ కంపెనీ  ఫ్లాగ్ షిప్ SUV. సూర్యకుమార్ మెర్సిడెస్-బెంజ్ SUV ఫ్రంట్ గ్రిల్  భిన్నంగా ఉన్నందున AMG కిట్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది. 

ఇంజిన్ అండ్ పవర్
ప్రస్తుతానికి, Mercedes-Benz భారత మార్కెట్లో  GLS 400d 4MATIC వేరియంట్‌ను మాత్రమే అందిస్తోంది. 3.0-లీటర్, స్ట్రెయిట్-సిక్స్ డీజిల్ ఇంజన్‌ 330 hp గరిష్ట శక్తిని, 700 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 9-స్పీడ్ G-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ ఇచ్చారు, ఇది Mercedes-Benz 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా మొత్తం నాలుగు చక్రాలను నడుపుతుంది. 

స్పీడ్ అండ్ ఆక్సీలరేషన్ 
Mercedes-Benz GLS SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదని వాహన తయారీ సంస్థ పేర్కొంది. Mercedes-Benz GLS SUV టాప్ స్పీడ్ 238 kmph. GLS కార్ 2505 కిలోల కర్బ్ బరువు, 3,250 కిలోల గ్రాస్ బరువుతో చాలా భారీ కారు. 

గొప్ప ఫీచర్లు
GLS కావడంతో ఈ కారులో ఎవరైనా ఆలోచించగలిగే అన్ని ఫీచర్లతో వస్తుంది. దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన వైడ్‌స్క్రీన్ కాక్‌పిట్‌ ఇచ్చారు. ఇంకా సాఫ్ట్-క్లోజ్ డోర్‌లను పొందుతుంది అలాగే బ్యాక్ కంఫర్ట్ ప్యాకేజీ ప్లస్ MBUX రియర్ టాబ్లెట్‌ లభిస్తుంది, దీనితో కారు లోపల ఉన్నవారు SUV డ్యూటీస్ కంట్రోల్ చేయవచ్చు. GLSని 7-సీటర్ SUVగా కూడా అందించబడుతోంది.

సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ పరంగా GLSలో బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేకింగ్ అసిస్ట్, ప్రీ సేఫ్ సిస్టమ్, అడాప్టివ్ హై బీమ్, అటెన్షన్ అసిస్ట్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. ఈ SUVని యాక్టివ్ డంపింగ్‌ ఎయిర్ సస్పెన్షన్‌తో కూడా అందించబడుతోంది. అంతేకాకుండా, కనెక్ట్ కార్ టెక్నాలజీ ఇందులో ఉంది, దీనిని Mercedes Me యాప్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ హైలెట్ గురించి మాట్లాడుతూ జియో-ఫెన్సింగ్, విండోస్ తెరవడం, మూసివేయడం ఇంకా సన్‌రూఫ్, వెహికల్ ఫైండర్ మొదలైన ఫీచర్స్ పొందుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios