కారు కొనేవారికి ఆఫర్లే, ఆఫర్లు... త్వరపడండి

నూతన వసంతానికి మరొక్క రోజు వ్యవధి మాత్రమే ఉన్నది. అయితే వివిధ డీలర్ల వద్ద మిగిలిపోయిన కార్ల విక్రయాల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలన్నీ రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. మారుతి సుజుకి మొదలు స్కోడా, వోక్స్ వ్యాగన్.. రెనాల్డ్, హోండా, టయోటా, నిస్సాన్, జిప్ కంపాస్ తదితర సంస్థలన్నీ క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్, ప్రభుత్వోద్యోగులకు వేర్వేరుగా డిస్కౌంట్లు ప్రకటించాయి

Cars with best discount offers in 2018

మరో రెండు రోజుల్లో 2018 ముగిసిపోయి, నూతన వసంతం ప్రారంభం కానున్నది. అయితే కార్ల కొనుగోలు దారులకు 2018 ఉత్తమ సంవత్సరంగా మిగిలిపోనుంది. ఈ ఏడాదిలో ఉత్పత్తి చేసిన కార్లలో అమ్ముడు పోకుండా మిగిలిపోయిన వాటిని విక్రయించేందుకు దేశవ్యాప్తంగా వివిధ కార్ల డీలర్లు సిద్ధంగా ఉన్నాయి. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా భారీ డిస్కౌంట్లు అందజేస్తున్నారు డీలర్లు. అలా డిస్కౌంట్లు లభిస్తున్న కార్లలో కొన్నింటిని పరిశీలిద్దాం.. 

కారు కొనేవారికి ఆఫర్లే, ఆఫర్లు... త్వరపడండి
స్కోడా ఇండియా కార్ల తయారీ సంస్థ కొత్త మోడల్ స్కోడా రాపిడ్ సెడాన్ మోడల్ కార్ల కొనుగోలుదారులకు డిస్కౌంట్లు, ఆఫర్లు అందజేస్తోంది. కారు ధరపై రూ.50 వేల వరకు డిస్కౌంట్‌తోపాటు తొలి బీమా ప్రీమియంలో 50 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నది.

అలాగే తేలికైన ఈఎంఐ ఆప్షన్ కింద రూ.9999 చెల్లిస్తే, ఏడేళ్ల పీరియడ్ వరకు ఉంటుంది. ప్రీ పేమెంట్ ఆప్షన్‌ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు స్కోడా ఫైనాన్స్ అందజేస్తోంది. 

రూ.60 వేల వరకు వోక్స్ వ్యాగన్ రాయితీ 
వోక్స్ వ్యాగన్ తయారీ మోడల్ వెంట్రో కొనుగోలు చేస్తే రూ.60 వేల క్యాష్ డిస్కౌంట్‌తోపాటు రూ.40 వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుతోంది. ఇది చాలా ఆకర్షణీయంగానూ ఉంది. 

రూ.60 వేల వరకు రెనాల్ట్ డస్టర్ డిస్కౌంట్
రెనాల్డ్ మోడల్ డస్టర్ ఎస్‌యూవీ మోడల్ కారు కొనుగోలు దారులకు రూ.60 వేల వరకు డిస్కౌంట్ అందజేస్తోంది. ఏడాది ఫ్రీ బీమా వసతి కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం రూ.7.95 లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ ఆఫర్ 110పీఎస్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ కార్లపైనే అందిస్తున్నారు. 

మారుతి వాగన్ ఆర్ కారుపై రూ.75వేల వరకు సబ్సిడీ
వచ్చేనెల 23వ తేదీన మార్కెట్లో అడుగు పెట్టనున్న మారుతి న్యూ వాగన్ ఆర్ మోడల్ కారు కొనుగోలుదారులకు రూ.65 వేల నుంచి రూ.70 వేల వరకు రాయితీ కల్పిస్తోంది. సీఎన్జీ వేరియంట్ కారుపై రూ.70 వేలు, ఎఎంటీ మోడల్ కారుపై రూ.65 వేల రాయితీ కల్పిస్తున్నది. 

హ్యుండాయ్ టుస్కాన్‌పై రూ.80 వేల వరకు రాయితీ
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ టుస్కాన్ మోడల్ కారుపై రూ.80 వేల రాయితీ కల్పిస్తోంది. రూ.30 వేలు ఎక్స్చేంజ్ బోనస్, రూ.50 వేల కార్పొరేట్ బోనస్ కల్పిస్తోంది. అదనంగా ఒక ఏడాది బీమా ఉచితం. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.18.29 లక్షలు పలుకుతోంది. 

టయోటా కొరొల్లా ఆల్టిస్‌పై రూ. లక్ష వరకు ఆఫర్
టయోటా కిర్లోస్కర్ సంస్థ తయారీ మోడల్ టయోటా కొరొల్లా అల్టిస్ ధర రూ.16.27 లక్షలకు ప్రారంభం అవుతుంది. పెట్రోల్, డీజిల్ అండ్ ఆటోమొబైల్ వేరియంట్లపై క్యాష్ చెల్లింపులపై రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ ఉద్యోగులకు బోనస్ రూ.45 వేల బోనస్ కల్పిస్తోంది. 

హోండా బీఆర్వీపై రూ. లక్ష వరకు ప్యాకేజీ
ఏడు సీటర్ల హోండా ‘బీఆర్వీ’ మోడల్ కారు ధర రూ.9.22 లక్షల నుంచి రూ.13.39 లక్షల వరకు అమ్ముడవుతుంది. బీమాతోపాటు రూ. లక్ష వరకు బెనిఫిట్ ప్యాకేజీ కల్పిస్తోంది. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.50 వేల వరకు లభిస్తోంది. 

నిస్సాన్ టెర్రానోపై రూ.55 వేల వరకు ఆఫర్
నిస్సాన్ టెర్రానో మోడల్ కారు కొనుగోళ్లపై ఫెస్టివ్ క్యాష్ డిస్కౌంట్ రూ. లక్ష వరకు లభిస్తోంది. ఇందులో ఉచిత బీమా సౌకర్యం కూడా ఉంది. రూ.45 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్, ప్రభుత్వోద్యోగులకు రూ.10 వేల రాయితీ కల్పిస్తోంది. 

జీప్ కంపాస్ కొనుగోళ్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్
జీప్ కంపాస్ మోడల్ వాహనాల కొనుగోలుపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీని ధర రూ.15.44 లక్షల నుంచి రూ.22.95 లక్షల వరకు ఉంది. దీన్ని వచ్చే ఏడాదిలో మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios