ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు
వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..
భారత్‌లో ప్రధాన కారు తయారీ సంస్థలు వినియోగదారులకు ఆకర్షణీయ ఆపర్లు అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి ఏటా చివరిలో ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఆఫర్లు ప్రకటించడం సాధారణమే. ఈ ఆఫర్లకు తోడు ఎక్స్చేంజ్ బోనస్, కాంప్లిమెంటరీ యాక్సెసరీలు, ఫ్రీ సర్వీస్ అండ్ మెయింటెనన్స్ సర్వీస్ తదితర ప్యాకేజీలు అందుబాటులోకి తచ్చాయి. వీటికి తోడు ఆయా సంస్థల డీలర్ల వద్ద కూడా అదనపు ఆఫర్లు పొందొచ్చు.. ఫిబ్రవరి నెలలో కార్లు కొనుగోలు చేసే కస్టమర్లకు అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ ఒకసారి పరిశీలిద్దాం..
దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆఫర్లు:
సెలెరియో: రూ.63,100
డిజైర్: రూ.58,100
ఆల్టో కే 10: రూ. 47,100
విటారా బ్రెజా : రూ. 45,000
స్విఫ్ట్: రూ. 43,000
ఆల్టో 800: రూ. 37,100
ఎకో : రూ. 22,000
సియాజ్ : రూ. 75,000
ఎస్ -క్రాస్: రూ. 80,000
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ఆఫర్లు:
గ్రాండ్ ఐ10: రూ. 85,000
ఎక్స్‌సెంట్ : రూ. 90,000
ఎలైట్ ఐ 20: రూ. 50,000
ఐ 20 యాక్టీవ్ : రూ. 50,000
వెర్నా : రూ. 50,000
ఎలంట్రా : రూ. 1,30,000
టుస్కాన్ : రూ. 1,30,000
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ డిస్కౌంట్స్:
టియాగో: రూ. 50,000
టైగోర్ :రూ. 58,000
నెక్సాన్ : రూ.75,000
హెక్సా :రూ. 1,06,000
హోండా కార్స్ ప్రకటించిన ఇన్సెంటివ్‌లు:
బ్రియో: రూ. 19,000
జాజ్ : రూ. 45,000
అమేజ్ :రూ. 42,000
డబ్ల్యూఆర్- వీ :రూ. 42,000
సిటీ : రూ. 72,000
బీఆర్- వీ :రూ. లక్ష
ఫోర్డ్ కారు ఆఫర్లు ఇలా:
ఫ్రీ స్టైల్: రూ. 40,000
ఎస్పైర్ : రూ. 40,000
ఎకో స్పోర్ట్ : రూ. 45,000
జర్మనీ మేజర్ వోక్స్ వ్యాగన్ డిస్కౌంట్లు:
పొలో: రూ. 50,000
అమెయో : రూ. 65,000
వెంటో : రూ. లక్ష
దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా రాయితీలు:
కేయూవీ 100: రూ. 70,000
టీయూవీ 300: రూ. 75,000
మర్రాజో: రూ. 15,000
స్కార్పియో: రూ. 50,000
ఎక్స్‌యూవీ 500:రూ. 50,000
రెనాల్ట్:
క్విడ్: రూ.45,000
డస్టర్ : రూ. 20,000 అదనంగా ఒక ఏడాది బీమా సౌకర్యం
లాడ్జీ: రూ. 1.5 లక్షలు
కాప్చర్ : రూ. 2 లక్షలు
జీప్:
కంపాస్: రూ. 60,000
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలో బీఎస్ -6 మోడల్ కార్లను మార్కెట్లోకి తేవాల్సి ఉన్న నేపథ్యంలో వివిధ కార్ల తయారీ సంస్థలు తమ కార్లను విక్రయించేందుకు వినియోగదారులను టెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ధరలు, వ్యయం పెరిగిందన్న పేరుతో కార్ల ధరలు పెంచిన సంస్థలు ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్ కార్లపై భారీ ఆఫర్ల వరద కురిపిస్తున్నాయి.