5 సెకన్లలో 100 కి.మీ స్పీడుతో దూసుకెళ్లే బీఎండబ్ల్యూ కారు ! బెస్ట్ ఫీచర్స్ ఉన్న దీని ధర ఎంతో తెలుసా?
కొత్త X5 లోపలి భాగంలో 14.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. యాపిల్, ఆండ్రాయిడ్ కార్ ప్లే, హర్మాన్ గార్డెన్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో అందించారు.
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ BMW X5 SUV భారత మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 93.9 లక్షలతో మొదలై రూ. 1.06 కోట్లకు చేరుకుంటుంది. కొత్త X5 చెన్నైలోని BMW గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేయబడింది. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని BMW అవుట్‌లెట్‌లలో లభిస్తుంది.
కొత్త ఫేస్‌లిఫ్టెడ్ BMW X5 బ్లూ టింట్‌తో మ్యాట్రిక్స్ అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. కారు అంతటా అల్యూమినియం ట్రిమ్డ్ టాప్‌ని పొందుతుంది. వెనుక భాగంలో ఎల్-ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్‌తో రూపొందించబడింది. 21-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
కొత్త X5 లోపలి భాగంలో 14.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. యాపిల్, ఆండ్రాయిడ్ కార్ ప్లే, హర్మాన్ గార్డెన్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో అందించారు.
ఈ BMW కారులో వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ ఇంకా రివర్స్ అసిస్టెంట్, సరౌండ్ వ్యూ కెమెరా, డ్రైవ్ రికార్డర్, రిమోట్ పార్కింగ్ ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ డిఫరెన్షియల్ లాక్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టూ-యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఐసోఫిక్స్ మౌంట్‌లు ఇంకా మరిన్ని ఉన్నాయి.
కొత్త BMW X5 రెండు ఇంజన్ వేరియంట్‌లతో అందుబాటులో ఉంటుంది. 3-లీటర్, 6-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ కేవలం 5.4 సెకన్లలో 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. మరొక వేరియంట్ 3.0-లీటర్, 6-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో కేవలం 6.1 సెకన్లలో 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది.