Asianet News TeluguAsianet News Telugu

BMW Motorrad:టూరింగ్ అండ్ రైడింగ్ కోసం బి‌ఎం‌డబల్యూ కొత్త బైక్స్.. లగ్జరీ, హై పర్ఫర్మేస్ కోసం ప్రత్యేకంగా..

ఈ మూడు  బైక్స్ మధ్య చిన్నపాటి తేడాలు ఉన్నాయి. వీటిలో  ఉన్న ఫీచర్ల గురించి మాట్లాడుతూ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, 4 కాన్ఫిగర్  ఫేవరెట్ బటన్ క్లస్టర్, LED హెడ్‌ల్యాంప్, హిల్-స్టార్ట్ కంట్రోల్, హీటింగ్ గ్రిప్స్, సైడ్ కేస్, సీట్ హీటింగ్ ఇంకా మరిన్ని ఉన్నాయి. 

BMW Motorrad launches K 1600 range of motorcycles know its price and features
Author
Hyderabad, First Published Aug 18, 2022, 5:01 PM IST

బి‌ఎం‌డబల్యూ మోటరాడ్ (BMW Motorrad) ఇండియాలో టూరింగ్ రేంజ్ ప్రారంభించింది, ఇందులో K1600 అండ్ K1250 ఉన్నాయి. K1600 లైనప్‌లో మూడు బైక్స్ ఉన్నాయి - బాగర్, GTL ఇంకా గ్రాండ్ అమెరికా. ప్రతి బైక్ కొద్దిగా భిన్నంగా రూపొందించారు, అలాగే లగ్జరీ, హై పర్ఫఅర్మేస్   టూరింగ్ అండ్ రైడింగ్ కోసం కూడా నిర్మించారు. ఈ బైక్స్ మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో వస్తాయి. అంతేకాదు అదనపు ఖర్చుతో వారంటీని  4వ, 5వ సంవత్సరాలకు పొడిగించవచ్చు. కస్టమర్లు సెలెక్ట్ చేసుకునేల రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ అందిస్తుంది. 

ధర
1600 B అనేది బ్యాడ్జర్-స్టయిల్ బైక్, ఈ బైక్ సౌకర్యవంతంగా నడపడానికి ఉద్దేశించబడింది. 1600 GTL పర్ఫర్మెంస్ కోసం నిర్మించబడింది, అయితే 1600 గ్రాండ్ అమెరికా గ్రాండ్ టూరింగ్ కోసం నిర్మించబడింది. బ్యాగర్ ధర రూ.29.90 లక్షలు, జీటీఎల్ ధర రూ.32 లక్షలు, గ్రాండ్ అమెరికా ధర రూ.33 లక్షలు. ఈ ధరలు అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు. 

ఫీచర్లు
ఈ మూడు  బైక్స్ మధ్య చిన్నపాటి తేడాలు ఉన్నాయి. వీటిలో  ఉన్న ఫీచర్ల గురించి మాట్లాడుతూ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, 4 కాన్ఫిగర్  ఫేవరెట్ బటన్ క్లస్టర్, LED హెడ్‌ల్యాంప్, హిల్-స్టార్ట్ కంట్రోల్, హీటింగ్ గ్రిప్స్, సైడ్ కేస్, సీట్ హీటింగ్ ఇంకా మరిన్ని ఉన్నాయి. అన్ని బైక్స్ ఇంటిగ్రేటెడ్ మ్యాప్ నావిగేషన్ అండ్ కనెక్టివిటీతో 10.25-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లేతో వస్తాయి. దీనిని ఆడియో సిస్టమ్‌కు కూడా కనెక్ట్ చేయబడింది. 

ఇంజిన్ అండ్ పవర్ 
K1600 బాగర్, K1600 గ్రాండ్ అమెరికా అండ్ K 1600 GTL బైక్స్ 1,649 cc, 6-సిలిండర్, ఇన్-లైన్ ఇంజన్‌ పొందుతాయి. ఈ ఇంజన్ 6,750rpm వద్ద గరిష్టంగా 160hp శక్తిని ఇంకా 5,250rpm వద్ద 180Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ టార్క్ పవర్ డెలివరీ కోసం నిర్మించబడింది. దీనికి 6-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ ఇచ్చారు, ఇది షాఫ్ట్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని ప్రసారం చేస్తుంది. థ్రోటల్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంది. 

బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్
BMW ఆటోమేటిక్ లోడ్ లెవలింగ్ అండ్ డైనమిక్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ అడ్జస్ట్‌మెంట్‌తో డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్‌ను అందిస్తోంది. మూడు బైక్స్ బ్రేకింగ్ డ్యూటీ ఫోర్-పిస్టన్ కాలిపర్‌లతో పాటు ముందు భాగంలో ట్విన్ 320 mm డిస్క్‌ల ద్వారా చేయబడుతుంది. వెనుక భాగంలో టు-పిస్టన్ కాలిపర్‌తో సింగిల్ 320 mm డిస్క్, మూడు రైడింగ్ మోడ్‌లు రెయిన్, రోడ్ అండ్ డైనమిక్ ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios