లైసెన్స్ అవసరం లేని బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని ధర, ఫీచర్లు, మైలేజ్ గురించి తెలుసా..
అంతర్జాతీయ మార్కెట్‌లో బిఎమ్‌డబ్ల్యూ కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ ప్రస్తుతం ఈ స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్ కోసం మాత్రమే తయారు చేసింది, దీనిని ఇండియాలోకి తీసుకురావడం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
కొత్త అండ్ ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ CE 02ను BMW మోటోరాడ్ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో కంపెనీ ఇచ్చిన ఫీచర్లు ఏంటి, ఏ ధరకు ఎంత రేంజ్‌లో అందించారు ఈ సమాచారాన్ని చూద్దాం...
బిఎమ్‌డబ్ల్యూ స్కూటర్ లాంచ్
బిఎమ్‌డబ్ల్యూ స్కూటర్ CE 02ను తాజగా లాంచ్ చేయబడింది. కంపెనీ ప్రస్తుతం ఈ స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్ కోసం మాత్రమే తయారు చేసింది, దీనిని ఇండియాలోకి తీసుకురావడం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఫీచర్లను తెలుసుకోండి
దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉండేలా ప్రయత్నం చేశారు. స్కూటర్ ప్రధానంగా సిటీ రైడ్ కోసం తయారు చేయబడింది. స్కూటర్‌లో ఫ్లాష్, సర్ఫ్ ఇంకా ఫ్లో వంటి రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్‌కి 14-అంగుళాల వీల్స్, డిస్క్ బ్రేక్‌లు, ABS, LED హెడ్‌లైట్లు, USD ఫ్రంట్ ఫోర్క్స్, సింగిల్ సీట్, 3.5-అంగుళాల TFT స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్ ఫుల్ బ్యాటరీ అండ్ మోటారు
దీనికి డబుల్ బ్యాటరీ అప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకే బ్యాటరీతో ఈ స్కూటర్ గరిష్టంగా 45 kmph వేగంతో, 45 km రేంజ్ మాత్రమే పొందుతుంది. విశేషమేమిటంటే, యూరప్‌లోని చాల దేశాల్లో సింగిల్ బ్యాటరీ వేరియంట్‌ను డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. స్కూటర్ డబుల్ బ్యాటరీ వేరియంట్ 90 కిమీ పరిధిని ఇస్తుంది, దీని టాప్ స్పీడ్ గంటకు 95 కి. మీ వరకు ఉంటుంది.
స్కూటర్‌లోని బ్యాటరీ నుండి 15 హార్స్‌పవర్ వస్తుంది. ఇంకా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది, ఒకే బ్యాటరీ కేవలం మూడు గంటల్లో ఛార్జ్ అవుతుంది. భారత కరెన్సీలో వీరి ధర రూ.6.28 లక్షలు నుండి ఏడు లక్షలు.