భవిష్ అగర్వాల్  ఒక ట్వీట్‌లో ఇదంతా పూర్తిగా అర్ధంలేనిది అంటూ పోస్ట్ చేశారు. మేము లాభాలను ఆర్జించే సంస్థ, ప్రస్తుతం మా వృద్ధి బాగానే ఉంది. మేం ఏ కంపెనీలోనూ విలీనం కావడం లేదు.

 ఓలా, ఉబర్‌లు విలీనం కావడం లేదని ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ నివేదికలు నిజం కాదని ఆయన అభివర్ణించారు. తాజాగా క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ఓలా అండ్ ఉబెర్ రెండూ విలీనం కావచ్చని చర్చ జరిగింది. అయితే, ఈ నివేదికలు ఇంకా బలం పుంజుకోకముందే అలాంటిదేమీ జరగబోదని ఆ వార్తలు కేవలం చెత్త మాత్రమేనని భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.

భవిష్ అగర్వాల్ ఒక ట్వీట్‌లో ఇదంతా పూర్తిగా అర్ధంలేనిది అంటూ పోస్ట్ చేశారు. మేము లాభాలను ఆర్జించే సంస్థ, ప్రస్తుతం మా వృద్ధి బాగానే ఉంది. మేం ఏ కంపెనీలోనూ విలీనం కావడం లేదు.

ఓలా ఎగ్జిక్యూటివ్‌లతో కంపెనీ సమావేశమైందని, విలీనానికి సంబంధించి చర్చలు జరిగాయని చెబుతున్న వార్తలను కూడా Uber తిరస్కరించింది. మరోవైపు విలీనానికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఓలా అండ్ ఉబర్ ఈ రెండు కంపెనీలు ఈ రోజుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కాలం తర్వాత మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. అంతేకాకుండా ఓలా గ్రోసరి వ్యాపారాన్ని మూసివేయవలసి వచ్చింది. ఉబెర్ ఫుడ్ ప్రొవైడర్ సర్వీస్ ఉబెర్ ఈట్స్‌ను జోమాటోకు విక్రయించాల్సి వచ్చింది. ఎక్కువ మంది కస్టమర్‌లను పొందాలనే తపనతో క్యాష్‌బ్యాక్ లేదా తక్కువ ఛార్జీల వంటి డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా ఈ కంపెనీల పరిస్థితిని మరింత దిగజార్చాయి. 

ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు కంపెనీలు త్వరలో ఒకదానితో ఒకటి విలీనం కావచ్చని కొన్ని మీడియా నివేదికలలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఓలా కంటే ఉబెర్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆసియాలో, Uber మార్కెట్ జపాన్ అండ్ భారతదేశానికి మాత్రమే పరిమితం చేయబడింది. కొన్ని దేశాల్లో సేవలను కూడా నిలిపివేయవలసి వచ్చింది. కరోనా వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసింది.