Vehicle Sales 2022: ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు.. నిరాశ‌ప‌రిచిన మారుతీ, హ్యుందాయ్‌

సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల సేల్స్ తగ్గినప్పటికీ, జనవరి నెలతో పోలిస్తే మాత్రం పుంజుకున్నాయి. కొన్ని కంపెనీల సేల్స్ పెరగగా, మరిన్ని కంపెనీల సేల్స్ తగ్గాయి. ప్రధానంగా చిప్ ఇబ్బందులు కనిపించాయి. 

Auto sales in February 2022

సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల సేల్స్ తగ్గినప్పటికీ, జనవరి నెలతో పోలిస్తే మాత్రం పుంజుకున్నాయి. కొన్ని కంపెనీల సేల్స్ పెరగగా, మరిన్ని కంపెనీల సేల్స్ తగ్గాయి. ప్రధానంగా చిప్ ఇబ్బందులు కనిపించాయి. మారుతీ, హ్యుండాయ్, హోండా, టయోటా సేల్స్ నిరాశపరచగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ సేల్స్ పెరిగాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ క్షీణించాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది.

దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా( MSI)  ఫిబ్రవరిలో మొత్తం టోకు విక్రయాలు  1,64,056 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. ఫిబ్రవరి  2021లో కంపెనీ  1,64,469 యూనిట్లను విక్రయించినట్లు  MSI  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఫిబ్రవరి 2021లో 1,52,983 యూనిట్ల నుంచి గత నెలలో కంపెనీ దేశీయ విక్రయాలు 8.46 శాతం క్షీణించి 1,40,035 యూనిట్లకు పడిపోయాయని తెలిపింది. 

సెమీకండక్టర్ కొరత కారణంగా మారుతీ సుజుకి అమ్మకాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో తగ్గాయి. ఈ క్రమంలోనే.. వాహనాల ఉత్పత్తిని కూడా మారుతీ సుజుకి తగ్గించింది. ఫిబ్రవరి నెల మొత్తం అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1,64,056 యూనిట్ల నుంచి 1,64,469 యూనిట్లకు తగ్గాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత ప్రధానంగా దేశీయ మార్కెట్‌లో విక్రయించే వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపింది. ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుందని ఎంఎస్ఐ తెలిపింది. 

ఆల్టో, ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ కార్ల విక్రయాలు గత ఏడాది ఇదే నెలలో 23,959తో పోలిస్తే 17.81 శాతం తగ్గి 19,691 యూనిట్లకు పడిపోయాయి. అదేవిధంగా.. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడళ్లతో సహా కాంపాక్ట్ విభాగంలో అమ్మకాలు ఫిబ్రవరి  2021లో 80,517 కార్ల నుంచి 3.38 శాతం క్షీణించి  77,795 యూనిట్లకు పడిపోయాయి.   

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా విక్రయాలు సైతం ఫిబ్రవరిలో క్షీణించాయి. ఫిబ్రవరిలో హ్యుందాయ్ మొత్తం విక్రయాలు 14 శాతం క్షీణించి 53,159 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 61,800 యూనిట్లను విక్రయించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.   
దేశీయ విక్రయాలు ఫిబ్రవరి 2021లో  51,600 యూనిట్ల నుంచి గత నెలలో 14.6 శాతం తగ్గి  44,050  యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో ఎగుమతులు 10,200  యూనిట్ల నుంచి 10.7 శాతం క్షీణించి 9,109  యూనిట్లకు పడిపోయాయని ఆటో మేజర్ వెల్లడించింది. 

టాటా మోటార్స్ తన మొత్తం దేశీయ విక్రయాలలో మాత్రం వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరిలో సంవత్సరానికి  27 శాతం పెరిగి  73,875  యూనిట్లకు చేరుకుంది. ఫిబ్రవరి  2021లో కంపెనీ  58,366  యూనిట్లను పంపింది. దేశీయ విపణిలో తమ ప్యాసింజర్ వాహన విక్రయాలు గత ఏడాది ఇదే నెలలో  27,225  యూనిట్ల నుంచి 47 శాతం పెరిగి 39,981 యూనిట్లకు చేరుకున్నాయని ఆటోమేజర్ తెలిపింది. 

భారతదేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలలో ఒకటైన మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫిబ్రవరి  2022 నెలలో మొత్తం ఆటో అమ్మకాలు  89 శాతం వృద్ధితో  54,455 కి చేరాయని ప్రకటించింది. యుటిలిటీ వెహికల్స్ విభాగంలో మహీంద్రా ఫిబ్రవరి 2022లో  27,551 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్ (ఇందులో  UVలు, కార్లు, వ్యాన్‌లు ఉన్నాయి) ఫిబ్రవరి 2022లో 27,663 వాహనాలను విక్రయించింది. ఈ నెలలో ఎగుమతులు 2814 వాహనాలుగా ఉన్నాయి. 

ఇక కంపెనీకి చెందిన కమర్షియల్ వెహికల్స్ విభాగంలో మహీంద్రా ఫిబ్రవరి 2022లో 119% వృద్ధితో  20,166  వాహనాలను విక్రయించింది. కంపెనీకి చెందిన అన్ని లైట్ కమర్షియల్ వెహికల్ విభాగాలు, హెవీ కమర్షియల్ వాహనాలు ఫిబ్రవరి 2022లో తమ బలమైన వృద్ధిని కొనసాగించాయి. దీనిపై  M&M  లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. మొత్తం 54,455 వాహనాల విక్రయంతో  ఫిబ్రవరి 2022లో మేము 89% వృద్ధిని సాధించాము.  SUVలతో సహా అన్ని విభాగాలు నెలవారీగా  79% అదిరిపోయే గ్రోత్‌ను కనబరిచాయి. కోవిడ్ కారణంగా పూర్తిగా తగ్గిపోయిన డిమాండ్.. ఇక ముందు బలంగా సాగుతుందని ఆశిస్తున్నాం. మేము సెమీ-కండక్టర్ సంబంధిత విడిభాగాల సరఫరాపై దృష్టి సారిస్తాం అని తెలిపారు. ద్విచక్రవాహన‌ సేల్స్ భారీగా తగ్గాయి. హీరో మోటో కార్ప్ సేల్స్ 29 శాతం క్షీణించి 5,05,467 నుండి 3,58,245కు తగ్గాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ 15 శాతం, టీవీఎస్ మోటార్స్ 5 శాతం, హోండా మోటార్ సైకిల్ 29 శాతం తగ్గాయి. సుజుకీ మోటార్ మాత్రం దాదాపు స్థిరంగా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios