Audi Q7: అదితి రావ్ హైదరి లగ్జరీ కార్.. ఈ ప్రీమియం ఎస్‌యూవీ కార్ ధర, ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే..
ఆడి ముంబై వెస్ట్ డీలర్‌షిప్ నటి అదితి రావుకి కొత్త విలాసవంతమైన రైడ్‌ను డెలివరీ చేసినట్లు వాహన తయారీ సంస్థ తెలిపింది. ఆడి క్యూ7 సెలబ్రిటీలకు ఇష్టమైన లగ్జరీ SUVలలో ఒకటి.
బాలీవుడ్‌లో లగ్జరీ కార్లకు పెద్ద క్రేజ్ ఉంది. చాలా మంది సినిమా హీరోలు, హీరోయిన్లకు ఒకటి కంటే ఎక్కువ బ్రాండ్ కార్లు ఉన్నాయి. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా కార్ల కొనుగోలుదారుల జాబితాలో నటి అదితి రావు హైదరీ కొత్త పేరు చేరింది. ఇప్పుడు అదితి రావ్ హైదరీ కార్ కలెక్షన్‌లో మరో కారు వచ్చింది. దీంతో ఆడి ఫ్లాగ్‌షిప్ SUV ఆడి క్యూ7కి అదితి రావు హైదరీ ఓనర్‌గా మారారు.
ఆడి ముంబై వెస్ట్ డీలర్‌షిప్ నటి అదితి రావుకి కొత్త విలాసవంతమైన రైడ్‌ను డెలివరీ చేసినట్లు వాహన తయారీ సంస్థ తెలిపింది. ఆడి క్యూ7 సెలబ్రిటీలకు ఇష్టమైన లగ్జరీ SUVలలో ఒకటి. చాలా మంది బాలీవుడ్ నటీనటులు ఈ కారు అద్భుతమైన రైడ్ నాణ్యత, ఫీచర్లు, టెక్నాలజితో పాటు దాని పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌కి ఆకర్షితులవుతారు. అందుకే ఈ SUVని సొంతం చేసుకుంటారు. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కారుపై ప్రేమలో మునిగితేలుతున్నారు. కొన్ని రోజుల క్రితం తేజస్వి ప్రకాష్, అతియా శెట్టి, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా, షానాయ కపూర్ కూడా ఈ శక్తివంతమైన SUVని కొనుగోలు చేశారు.
రెండు ట్రిమ్‌లలో
Audi Q7 లగ్జరీ SUV భారతీయ మార్కెట్లో ప్రీమియం ప్లస్ (premium plus), టెక్నాలజీ (technology)అనే రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఆడి క్యూ7 ప్రీమియం ప్లస్ ధర రూ. 79, 99,000 లక్షలు, ఆడి క్యూ7 టెక్నాలజీ ధర రూ. 88, 33,000 లక్షలు. ఆడి ఇండియా ప్రీమియం SUV 2022 Audi Q7 ఫేస్‌లిఫ్ట్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఆడి క్యూ7 రోడ్ అండ్ ఆఫ్ రోడ్ రెండింటిలోనూ అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
ఇంజిన్ అండ్ పవర్
Audi Q7 ఫేస్‌లిఫ్ట్ SUVలో అతిపెద్ద ఇంకా అతి ముఖ్యమైన మార్పు ఇంజిన్‌లో చేయబడింది. ఈ SUV కొత్త 3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇచ్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 340 hp శక్తిని, 500 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టాప్ స్పీడ్
ఈ SUV 5.9 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. టాప్ స్పీడ్ 250 kmph. Q7 ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది.
లుక్ అండ్ డిజైన్
ఆడి Q7 ముందు భాగం బలమైన త్రీ-డైమెన్షనల్ ఎఫెక్ట్‌తో కొత్త బంపర్ ఇంకా హై ఎయిర్ ఇన్‌లెట్ పొందుతుంది.
కొత్త సిల్ ట్రిమ్‌తో ఫ్లాట్ అండ్ వెడల్పుగా కనిపించే సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ వాహనానికి కొత్త రూపాన్ని ఇస్తుంది.
మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్ డే లైట్లు ఇంకా LED టెయిల్ ల్యాంప్ ఇండికేటర్‌తో డైనమిక్ టర్న్ ఇండికేటర్ పొందుతుంది.
అంతేకాకుండా హై గ్లోస్ స్టైలింగ్ ప్యాకేజీ, ఇంటిగ్రేటెడ్ వాషర్ నాజిల్‌తో కూడిన అడాప్టివ్ విండ్ షీల్డ్ వైపర్‌లు వస్తాయి.
ఆడి క్యూ7కి 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు
ఆడి Q7 ఐదు రంగులలో వస్తుంది - కరారా వైట్, మైథోస్ బ్లాక్, నవారా బ్లూ, సమురాయ్ గ్రే, ఫ్లోరెట్ సిల్వర్.
ఆడి క్యూ7 ఇంటీరియర్ సైగా బీజ్ అండ్ ఒకాపి బ్రౌన్ అనే రెండు కలర్స్ లో వస్తుంది.
ఇంటీరియర్ అండ్ ఫీచర్లు
ఆడి క్యూ7 ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ SUV 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం 8.6-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది.
Audi Q7 B&O ప్రీమియం 3D సౌండ్ సిస్టమ్‌ను పొందుతుంది - సౌండ్ ప్లేబ్యాక్, 19 స్పీకర్లు, సెంటర్ స్పీకర్ ఇంకా సబ్‌వూఫర్, 16 ఛానల్ యాంప్లిఫైయర్‌తో సహా 3D స్పీకర్ మొత్తం 730Wats పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
ఆడి క్యూ7లో బ్యాక్ సీట్లో కూర్చున్న వారి వినోదం కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఆడి ఎంటర్‌టైన్‌మెంట్ మొబైల్ (రియర్ సీట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్) కూడా ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ ద్వారా అందుబాటులో ఉంది. Audi Q7 3D సౌండ్‌తో B&O ప్రీమియం సౌండ్ సిస్టమ్‌తో అమర్చబడింది.