రోడ్డుపైనే కాదు నీళ్లలో కూడా దూసుకుపోతున్న ఈ కారు స్పీడ్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సీ లయన్ కారు బాడీ CNC మైల్డ్ ముక్కలతో తయారు చేయబడింది, ఇంకా దానికి మోనోకోక్ కూడా జోడించారు. ఈ కారు నీటిపై, రోడ్డు పై కూడా ప్రయాణిస్తుంది.
మీ కారును చెరువు లేదా నీటి వద్దకు తీసుకెళ్లిన వెంటనే స్పీడ్‌బోట్‌గా మార్చాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా..? అలా అయితే సీ లయన్(Sea Lion) మీకు సరైన కారు. అవును, సీ లయన్ అలాంటి కారే, మీరు రోడ్డుపైనే కాకుండా సముద్రం, నదితో పాటు చెరువులో కూడా దీనిని నడపవచ్చు.
13B రోటరీ ఇంజిన్‌తో అమర్చబడిన ఈ కారు నీటిపై 60 mph(97 km/h), భూమిపై 125 mph స్పీడ్ తో వెళ్లగలదు. ఈ కారును తయారు చేయడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది.
ఈ కారు ధర ఎంతంటే
ఈ కారు బాడీ CNC మైల్డ్ ముక్కలు, TIG వెల్డెడ్ 5052 అల్యూమినియంతో తయారు చేసారు. కారు మధ్యలో మోనోకోక్ జోడించారు. ఇది వెనుక, ముందు ఫెండర్‌లతో పాటు ముడుచుకునే సైడ్ పాడ్‌లను కూడా పొందుతుంది. సీ లయన్ భూమి, నీరు పై రెండింటిపై ప్రయాణించగల అత్యంత వేగవంతమైన వాహనం టైటిల్ కోసం పోటీపడుతోంది. ఈ కారు ధర చాలా కూడా ఎక్కువ. దీన్ని కొనాలంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కార్ల కంపెనీ ఈ వాహనాన్ని ఫాంటసీ జంక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది.
స్పీడ్ పరంగా మరో 25 కార్లకు పోటీ
ఈ కారు అనధికారిక యాంఫిబియస్ వరల్డ్ స్పీడ్ రికార్డ్ పోటీలో ప్రధాన పోటీదారుగా ఉంది, స్పీడ్ పరంగా దాదాపు 25 ఇతర వాహనాలకు గట్టి పోటీనిస్తుంది. ఈ కారు ఎక్కువగా TIG-వెల్డెడ్ 5052 అల్యూమినియంతో CNC ప్లాస్మా బర్న్ ఫారమ్, CNC మిల్లింగ్ భాగాలతో తయారు చేయబడింది.
ఇప్పుడు 60 mph
భూమిపై స్పీడ్ ఇప్పటికీ అలాగే ఉంది, కానీ నీటిలో నడిచే కార్ స్పీడ్ 60 mph వరకు పెరిగింది. గతంలో 45 mph స్పీడ్ ఉండేది.