Ambassador 2.0: అంబాసిడ‌ర్‌ 2.0 కొత్త లుక్కు అదిరిందిగా..!

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మళ్లీ చక్రం తిప్పేందుకు అంబాసిడర్ సిద్ధమైంది. అంబాసిడర్ ఎలక్ట్రిక్ కారు రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసంద‌ర్భంగా హిందుస్తాన్ మోటార్స్ డైరెక్ట‌ర్ ఉత్త‌మ్ బోస్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం.
 

Ambassador 2.0 to hit roads in 2 years

అంబాసిడర్ కారు. పరిచయం అక్కర్లేని పేరు. భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో లెజెండ్‌. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్‌ అవ్వకపోవడంతో ఈ కారు సేల్స్‌ తగ్గిపోయాయి. దీంతో హిందుస్తాన్‌ ఆటోమొబైల్‌  ఆ ​కార్లకు స్వస్తి చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే కారు ఎలక్ట్రిక్‌  వెహికల్‌గా మార్కెట్‌కి పరిచయం కానుంది. 

రాయిటర్స్‌ కథనం ప్రకారం.. సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన హిందుస్తాన్‌ మోటార్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(హెచ్‌ఎంఎఫ్‌సీఎల్‌) డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ సైతం అంబాసీడర్‌ కారు లుక్‌ 'అంబోయ్' (amboy) తరహాలో ఉండనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో తన సొంత కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో అంబాసిడర్ కారు మెకానికల్‌, డిజైన్‌ వర్క్‌తో పాటు అడ్వాన్స్‌గా స్టేజ్‌తో కొత్త ఇంజిన్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇందుకోసం హిందుస్తాన్‌ మోటార్స్‌ ఫ్రెంచ్ కార్ మేకర్ పుజో(peugeot)తో చేతులు కలిపినట్లు పేర్కొన్నారు. ఆంబోయ్‌ మోడల్‌ తరహాలో ఉండే ఈ కారును 2024 ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు రాయిటర్స్‌ సైతం తన కథనంలో హైలెట్‌ చేసింది. 

మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో తయారీ

గతంలో హిందుస్తాన్‌ మోటార్స్‌ చెన్నై మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో మిత్సుబిషి కార్లను, వెస్ట్‌ బెంగాల్‌ ఉత్తరపార తయారీ ఫ్లాంట్‌లలో అంబాసిడర్ కార్లను తయారు చేసేది.కానీ మిత్సుబిషి కార్ల డిమాండ్‌ తగ్గడంతో పీకల్లోతో నష్టాల్లో కూరుకుపోయింది. అందుకే హిందుస్తాన్‌ మోటార్స్‌ 2014 సెప్టెంబర్‌లో మిత్సుబిషి కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. మూడు సంవత్సరాల తర్వాత 2017లో అంబాసీడర్‌ కారు మ్యాని ఫ్యాక్చరింగ్‌ హక్కుల్ని సైతం రూ.80కోట్లకు ఫ్రెంచ్‌ కార్‌ మేకర్‌ పుజోకి అమ్మేసింది. తిరిగి మళ్లీ ఇప్పుడు చెన్నై ఫ్లాంట్‌లో హిందుస్తాన్‌ మోటార్స్‌ - పుజో భాగస‍్వామ్యంలో అంబాసిడర్ను కొత్త అవతార్‌లో తయారు చేస్తుంది.      
 
మారుతి 800 ఎంటర్‌ 
అంబాసిడర్ కారు ఐకానిక్ కారు స్టేటస్ సింబల్‌గా మారింది. దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. కానీ 1980ల ప్రారంభంలో కాస్ట్‌ ఎక్కువ,మైలేజ్‌ తక్కువ కావడంతో పాటు, నాసికరంగా అంబాసిడర్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడంతో వాటి అమ్మకాలు తగ్గిపోయాయి.

అదే సమయంలో మారుతీ 800 లాంటి మోడల్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. ధర తక్కువ కావడం, మైలేజ్‌, ట్రెండ్‌కు తగ్గట్లు మోడళ్లు మార్కెట్‌లోకి రావడంతో అంబాసిడర్ కారుకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. 1980 నుంచి సంవత్సరానికి 20వేల కార్లు అమ్ముడుపోగా..రాను రాను ఆసేల్స్‌ 2వేలకు పడిపోయాయి. దీంతో  57ఏళ్ల పాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న అంబాసిడర్‌ కారు తయారీని హిందుస్తాన్‌ ఆటోమొబైల్‌ సంస్థ  2014లో నిలిపివేసింది.  2017లో అంబాసిడర్‌ కారు మ్యాని ఫ్యాక్చరింగ్‌ హక్కుల్ని రూ.80కోట్లకు ఫ్రెంచ్‌ కార్‌ మేకర్‌ పుజోకి అమ్మేసింది.

రీ ఎంట్రీ అదిరిపోయేలా

అయితే ఇప్పుడు మళ్లీ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. అంబాసిడర్‌ ఎలక్ట్రిక్‌ కారుతో రీ ఎంట్రి అదిరిపోయేలా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా హిందుస్తాన్‌ మోటార్స్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ “అప్పట్లో మా  ఉద్యోగుల సంఖ్య 2,300 గా ఉండేది. ఇప్పుడు 300కి తగ్గింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios