Asianet News TeluguAsianet News Telugu

కోట్ల విలువైన బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నటి ! అతను ఎవరంటే..?

బిగ్ బాస్ ఫేమ్, నటి షెహనాజ్ గిల్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు షెహనాజ్ గిల్ గురించి సోదరుడు చేసిన పోస్ట్ వైరల్ గా  మారింది. ఎందుకంటే షెహ్నాజ్ తనకు అండగా నిలిచిన తన సోదరుడికి విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. 
 

Actress Shehnaz gifted a Benz car worth crores to her brother!-sak
Author
First Published Aug 9, 2023, 2:57 PM IST

ముంబయి: బిగ్‌బాస్‌ ద్వారా ఫెమస్ గా ఎదిగిన నటి షెహనాజ్ గిల్.. రోజుకో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం తర్వాత, షెహనాజ్ గిల్ తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆమెకి కోలుకోవడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఇప్పుడు షెహనాజ్ గిల్ తన సినీ కెరీర్‌లో కూడా పురోగతి సాధిస్తోంది. అయితే తన జీవితంలో సుఖ దుఃఖాలలో తనకు అండగా నిలిచిన తన   సోదరుడికి ప్రేమ కానుకగా గిఫ్ట్  ఇచ్చింది. సోదరుడు షెహబాద్ బడేషాకు విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ కారును గిఫ్టిచ్చింది.

షెహనాజ్ గిల్ బహుమతిగా ఇచ్చిన మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ కారు ధర రూ. 74.95 లక్షల నుండి రూ. 88.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. రోడ్డు టోల్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్  ఇతర ఖర్చులతో రూ.96 లక్షలు వరకు ఉండొచ్చు. దాదాపు కోటి విలువైన కారును అన్నాకు గిఫ్ట్ ఇచ్చారు.

బ్లాక్ కలర్ బెంజ్ ఈ క్లాస్ కారు తాళాన్ని షోరూమ్ సిబ్బంది షెహబాజ్ బాదేశాకు చేసి, కేక్ కట్ చేసి సెలెబ్రేషన్ చేసుకున్నారు. తరువాత షెహబాద్ స్వయంగా కారు నడుపుతూ ట్రావెల్ చేసారు. దీని గురించి షెహబాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసారు. అతని బంధువులు, స్నేహితులు, ఫ్యాన్స్  శుభాకాంక్షలు కూడా  తెలిపారు.

షెహనాజ్ దగ్గర చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రేంజ్ రోవర్ ఎవోక్, జాగ్వార్ ఎక్స్‌జె, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ ఉండగా ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ కారు అతని గ్యారేజిలో చేరింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ కారు అబ్సిడియన్ బ్లాక్, మొజావే సిల్వర్, సెలెంటిక్ గ్రే, డిజైనో రెడ్, హైటెక్ సిల్వర్ ఇంకా పోలార్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

Mercedes-Benz E-క్లాస్ OM656 Turbo I6 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 282 బిహెచ్‌పి పవర్, 600 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు డీజిల్ వేరియంట్‌లో BS6 ఎమిషన్ ఇంజన్ ఉంది. అలాగే, ఇందులో 2925 సిసి, 6 సిలిండర్ ఇన్‌లైన్, 4 వాల్వ్, డిఓహెచ్‌సి ఇంజన్ ఉన్నందున  అద్భుతమైన పర్ఫార్మెన్స్  ఇస్తుంది.

ఈ కారులో ABS బ్రేకింగ్, ఎయిర్ బ్యాగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అనేక సేఫ్టీ  ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం 6 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. ఇది 5 సీట్ల కారు ఇంకా అద్భుతమైన అలాగే సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios