2022 KTM 390: కేటిఎం కొత్త అడ్వెంచర్ బైక్.. దీని ధర, ప్రత్యేకత ఎంటో తెలుసుకోండి..
కేటిఎం 390 అడ్వెంచర్ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కారణంగా స్ట్రీట్ అండ్ ఆఫ్-రోడ్ మోడ్‌లతో వస్తుంది. బైక్ అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా బైక్ పడిపోయినా, ఆఫ్-రోడ్ మోడ్ యాక్టివ్‌గా ఉంటుంది.
కేటిఎం (KTM) కొత్త MY2022 390 అడ్వెంచర్ బైక్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్ ఢిల్లీలో 2022 KTM 390 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.3,28,500గా నిర్ణయించారు.
ఇంజిన్ అండ్ పవర్
2022 KTM 390 అడ్వెంచర్ బైక్ 373cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజన్ 43 బిహెచ్‌పి పవర్, 37 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్
WP అపెక్స్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లతో వెనుకవైపు అడ్జస్ట్ చేయగల మోనో-షాక్‌తో బైక్ నడుస్తుంది. బ్రేకింగ్ కోసం, డ్యూయల్ ఛానల్ ABSతో ముందు ఇంకా వెనుక 320 mm అండ్ 280 mm డిస్క్ బ్రేక్‌లు అందించారు.
డ్రైవ్ మోడ్
2022 KTM 390 అడ్వెంచర్ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కారణంగా స్ట్రీట్ అండ్ ఆఫ్-రోడ్ మోడ్‌లతో వస్తుంది. బైక్ అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా బైక్ పడిపోయినా, ఆఫ్-రోడ్ మోడ్ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా, KTM ఈ బైక్ లో మరింత బలమైన కాస్ట్ వీల్స్‌ను ఉపయోగించింది. దీంతో రిమ్స్ పటిష్టత పెరిగిందని కంపెనీ చెబుతోంది.
కలర్ ఆప్షన్స్
2022 KTM 390 అడ్వెంచర్ మోడల్ రెండు కొత్త కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో KTM ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ అండ్ డార్క్ గాల్వనో బ్లాక్ కలర్స్ ఉన్నాయి.