సుజుకి నుండి అడ్వెంచరిస్టిక్ ‘వీ-స్ట్రోమ్’...

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మార్కెట్లోకి మిలినియల్స్ లక్ష్యంగా నూతన తరం బైక్ అందుబాటులోకి తేనున్నది. మిలాన్ లో రహస్యంగా పరీక్షలు జరుపుకుంటున్న ఈ బైక్ వచ్చేనెల ఐదో తేదీన ప్రారంభమయ్యే ఎక్స్ పోలో ఆవిష్కరించనున్నారు.

2020 Suzuki V-Strom Teased In New Video

ముంబై: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి విపణిలోకి సరికొత్త బైక్ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వీ-స్ట్రోమ్’ పేరిట తీసుకొస్తున్న ఈ బైక్‌కు సంబంధించిన క్లోజప్ వీడియోను సంస్థ విడుదల చేసింది. ఈ వీడియోలో కంపెనీ వీ ఆకారం ‘బీమ్’ దీనిలో స్పష్టంగా కనిపించింది. సరికొత్త ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నాయి.

also read జావా, రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా బెనెల్లి కొత్త బైక్

లార్జి స్క్రీన్, హ్యాండ్ గార్డ్స్‌తో ఈ బైక్‌ను ఆఫ్‌రోడ్ డ్రైవింగ్‌కు అనుగుణంగా సుజుకి తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రైట్ హ్యాండ్ సైడ్ ఇంజిన్ ఏర్పాటు చేసిన ద్రుశ్యం కూడా కనిపిస్తుంది. థిక్ రబ్బర్ గ్రిప్‌తోపాటు ఇంజిన్ బాష్ ప్లేట్ కస్టమర్ల ముంగిట్లోకి తీసుకు రానున్న ఈ బైక్ ఒక అడ్వెంచర్‌గానే కనిపిస్తుంది. 

2020 Suzuki V-Strom Teased In New Video

వచ్చేఏడాది మార్కెట్లో అడుగిడనున్న ఈ బైక్‌కు సంబంధించి సామర్థ్య పరీక్షలను ఇటలీలోని ఒక రహస్య ప్రదేశంలో నిర్వహిస్తోంది సుజుకి యాజమాన్యం. సమర్థవంతమైన ఆఫ్ రోడ్ సామర్థ్యంతో ఈ బైక్‌ను రూపొందించారు. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చేనెల ఐదో తేదీన ఇటలీలోని మిలాన్ లో ప్రారంభమయ్యే ఈఐసీఎంఏ-2019 ప్రదర్శనలో విడుదల చేయనున్నది సుజుకి. 

also read 2020లో రాబోతున్న డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్

స్ట్రైకింగ్ ఆరెంజ్, రెడ్ అండ్ వైట్ లైవరీ రంగుల్లో లభించే ఈ బైక్.. 1980వ దశకం కాటి బార్ల్ బొరో నాటి సుజుకి డీఆర్ బిగ్ బైక్ ను సరిపోలి ఉంటుంది. ఇప్పటికైతే డీఆర్ బిగ్ బైక్ పేరును సార్థకం చేసుకుంటుందా? చెప్పలేమని, వచ్చేనెల మిలాన్ లో జరిగే ఆటో ఎక్స్ పోలో అసలు సంగతి తేలిపోనున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios