న్యూఢిల్లీ: వచ్చేనెల ఐదో తేదీ నుంచి జెనీవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ మోటర్ షోలో ప్రదర్శించనున్న ‘ఐ20’ కారు ఫ్రెష్ ఇమేజెస్ హ్యుండాయ్ మోటార్స్ ఆవిష్కరించింది. నూతన తరం ఐ20 మరింత స్పోర్టివ్‌గా, పూర్తిగా రీఫర్బిష్డ్ ఎక్స్‌టీరియర్లతో రూపుదిద్దుకున్నది. 

హ్యుండాయ్ ఐ20 మోడల్ కారు క్యాబిన్ ఇన్‌సైడ్‌లో పలు మార్పులు చేసింది. యూరప్ సభ్య దేశాల మార్కెట్ కోసం రూపుదిద్దుకున్న ఐ20, భారత విపణికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ఐ20 మోడల్ కారు మోడళ్లలో స్వల్ప మార్పులతో పలు ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ నమోదు చేసుకున్నాయి. 

హ్యుండాయ్ ఐ20 మోడల్ కారు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ గల ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లలో ఒకటి. ఇది ప్రత్యర్థి సంస్థలైన మారుతి సుజుకికి చెందిన బాలెనో, హోండా జాజ్, టయోటా గ్లాన్జా, టాటా ఆల్ట్రోజ్ మోడల్ కార్లతో తలపడనున్నది. ప్రతి నెలా కార్ల సేల్స్‌లో హ్యుండాయ్ సంస్థకు మెరుగైన భాగస్వామ్యం కలిగి ఉంది ఐ20. 

భారతదేశంలో కార్ల విక్రయాలను పెంపొందించడంలో హ్యుండాయ్ ఐ20 కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మధ్యలో హ్యుండాయ్ ఐ20 కారును విపణిలో ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. 

హ్యుండాయ్ ఎలైట్ ఐ20 ధర భారతదేశంలో రూ.5.60 లక్షల నుంచి రూ.9.41 లక్షలు పలుకుతోంది. నూతన ఐ20 కారు ధర రూ.6 నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

యూరప్ స్పెసిఫిక్ 2020 హ్యుండాయ్ ఐ20 కారు నూతన గ్రిల్లె అప్ ఫ్రంట్ కలిగి ఉంటుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ యూనిట్స్ తోపాటు హెడ్ ల్యాంప్స్ రీ డిజైన్ చేశారు. ఫ్రంట్, రేర్ బంపర్లు రీఫర్బీష్ చేశారు. న్యూ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ కూడా డెవలప్ చేశారు. 

17 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ ఎంటీనా, రేర్ స్పాయిలర్ తదితర ఫీచర్లు ఈ కారు సొంతం. ఇక ఇండియా స్పెసిఫిక్ ఐ20 కారులోనూ ఇవే ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా న్యూ 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, సెంటర్ టచ్ స్క్రీన్ ఫీచర్లు జత కలిశాయి. బోస్ ఆడియో సిస్టం విత్ ఎయిట్ స్పీకర్లు, వైర్ లెస్ చార్జర్, బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ ఫీచర్లు కూడా చేర్చారు. 

Also read:ఆధార్‌ నంబర్ ఉంటే చాలు. పది నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ


యూరప్ స్పెసిఫిక్ హ్యుండాయ్ ఐ20 కారు పది రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతానికి నాలుగు రంగుల ఆప్షన్లలోనే అందుబాటులోకి రానున్నది. ఇంటెన్స్ బ్లూ, అరోరా గ్రే, ఆక్వా టార్టాయిస్, బ్రాస్ రంగుల్లో లభించనున్నది. ఇప్పటికే పొలార్ వైట్, స్లీక్ సిల్వర్, ఫాంటోమ్ బ్లాక్, డ్రాగన్ రెడ్, టొమాటో రెడ్, స్లేట్ బ్లూ రంగుల్లోనూ లభిస్తున్నది. ఫాంటోమ్ భ్లాక్ రూఫ్ ఆప్షన్‪లోనూ ఐ20 కారు అందుబాటులోకి రానున్నది.