భారత్ మార్కెట్‌లోకి ‘ఆస్టిన్’ వాంటేజ్

బ్రిటన్‌కు చెందిన అతి విలాసవంతమైన కార్ల కంపెనీ ఆస్టిన్ పెట్టింది పేరు. తాజాగా మార్టిన్‌ లగ్జరీ కారును  విడుదల చేసింది.  అధికారికంగా ఇండియాలో  విడుదల చేసింది.

2019 Aston Martin Vantage Launched In India

బ్రిటన్‌కు చెందిన అతి విలాసవంతమైన కార్ల కంపెనీ ఆస్టిన్ పెట్టింది పేరు. తాజాగా మార్టిన్‌ లగ్జరీ కారును  విడుదల చేసింది.  అధికారికంగా ఇండియాలో  విడుదల చేసింది. దీని  ప్రారంభ ధరను  రూ. 2.95 కోట్లుగా నిర్ణయించింది.

దేశంలో ఈ కొత్త కార్లను ప్రతి రోజూ 15-20 యూనిట్లను విక్రయించాలని  కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుకింగ్స్‌  ప్రారంభం అయ్యాయి. తాజాగా ప్రీమియం కార్ల కొనుగోలుదారులకు పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది ఆస్టిన్. 

4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్, 6000 ఆర్పీఎం వద్ద 503 బీహెచ్‌పీ, 2000-5000 ఆర్‌పీఎం వద్ద 685 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజిన్లను  కూడా ఒక కొత్త 8- స్పీడ్ స్పోర్ట్ షిఫ్ట్- 2 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేసింది.

కేవలం 3.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంతోపాటు గంటకు 315 కీ.మి టాప్‌వేగంతో దూసుకుపోతుంది.ఆస్టిన్ వాంటేన్ కారు ప్రత్యర్థి సంస్థలు మెర్సిడెస్ - ఎఎంజీ జీటీ, పోర్షే 911 టర్బో, ఆడి ఆర్8 వీ 10 తదితర మోడల్ కార్లతో పోటీ పడనున్నది.

బేబీ ఆస్టిన్ మార్టిన్ తేలిక పాటి వాహనం కావడమే శక్తిమంతమైన కారుగా నిలువనున్నది. వుల్కాన్ సూర్ కారు, డీబీ 11 మోడల్ కార్ల స్ఫూర్తితో ఆస్టిన్ వాంటేజ్ డిజైన్ చేయబడింది. ఆస్టిన్ వాంటేజ్ మోడల్ కారు న్యూ ఫ్రంట్, రేర్ సబ్ ఫ్రేమ్స్ పూర్తిగా మార్చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios