చిన్నపిల్లలానే ఉంటారు. అందుకే వీరిని అందరూ మోసం చేయాలని చూస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశుల వారు... చాలా సులభంగా ఫూల్స్ అయిపోతారు.

మన చుట్టూ ఉన్నవారందరూ తెలివిగలవారై ఉండాలని రూలేమీ లేదు. కొందరు అమాయకులు కూడా ఉంటారు. వారు మంచికీ, చెడుకీ మధ్య తడాని అస్సలు గుర్తించలేరు. చిన్నపిల్లలానే ఉంటారు. అందుకే వీరిని అందరూ మోసం చేయాలని చూస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశుల వారు... చాలా సులభంగా ఫూల్స్ అయిపోతారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

1.మేషం

పసిపాపలా అమాయకులు. వారు ప్రతి ఒక్కరి గురించి సానుకూలంగా ఆలోచిస్తారు. ఇతరులు తమపై కుట్ర చేస్తున్నారనే విషయం కూడా వీరికి తెలీదు. ఎందుకంటే వారు ప్రజలలోని మంచిని చూడటంలో చాలా బిజీగా ఉన్నారు.

2.కర్కాటక రాశి..

వీరు మధురమైన మరియు సున్నితమైన వ్యక్తులు, వారు చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. వారు గాయపడడాన్ని భరించలేరు. కానీ ప్రజలు తరచుగా వారిని నిరాశపరుస్తారు. వీరు అందరితోనూ స్నేహంగా ఉంటారు. కానీ... ఇతరులు మాత్రం వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేయాలని చూస్తూ ఉంటారు.


3.సింహ రాశి...

సింహ రాశివారు కూడా ఎదుటివారిని బాధపెట్టాలని అనుకోరు. ఎవరైనా తమను బాధ పెట్టినా.... భరిస్తారు. కానీ... వీరు మాత్రం ఎశరినీ బాధపెట్టాలని అనుకోరు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. ప్రజలను తేలికగా నమ్మేస్తారు. చాలా సులభంగా ఇతరుల ఉచ్చులో పడిపోతూ ఉంటారు.

4.మకర రాశి...
వారు ప్రజలను త్వరగా విశ్వసిస్తారు, ఎందుకంటే వారిలాగే, ప్రతి ఒక్కరికి ఉన్నతమైన నీతి, నైతికత, విలువలు ఉన్నాయని వారు విశ్వసిస్తారు. వారు నిజాయితీగా ,పారదర్శకంగా ఉంటారు. తమలాగే అందరూ ఉత్తమంగా ఉంటారని వీరు అనుకుంటూ ఉంటారు.


5.కుంభ రాశి...
సృజనాత్మకత, ఫాంటసీ ,ఊహల ప్రపంచంలో వీరు జీవిస్తూ ఉంటారు. వీరు అందరూ మంచివారే అని నమ్ముతూ ఉంటారు. అందరూ తమలాగే మంచిగా ఉంటారని వారు భావిస్తూ ఉంటారు. వీరు అమాయకంగా ఉంటారు కాబట్టే... ఇతరులు వీరిని సులభంగా మోసం చేస్తూ ఉంటారు. 

ఈ రాశుల వారు చాలా తెలివైనవారు

వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మీనం రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ఎవరినీ త్వరగా విశ్వసించరు. వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు చాలా శ్రద్ధగా , అప్రమత్తంగా ఉంటారు కాబట్టి వారు ఎప్పటికీ సులభంగా ఉచ్చులో పడరు.