తమలోని బలం తెలుసుకుంటారు.. కానీ.. బలహీనతలపై పెద్దగా దృష్టి పెట్టరు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల మహిళల బలహీనతలు ఏంటో ఓసారి చూసేద్దామా..
మనిషి అన్న తర్వాత.. ప్రతి ఒక్కరిలోనూ బలం, బలహీనతలు ఉంటాయి. చాలా మందికి.. తమలోని బలం తెలుసుకుంటారు.. కానీ.. బలహీనతలపై పెద్దగా దృష్టి పెట్టరు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల మహిళల బలహీనతలు ఏంటో ఓసారి చూసేద్దామా..
1.మేష రాశి..
ఈ రాశి మహిళలకు కాస్త ఓపిక తక్కువ. ఇక వీరికి ఎమోషన్స్ కూడా చాలా తక్కువ అనే చెప్పాలి. బండరాయిలా ఉంటారు. ఇదే వీరిలోని బలహీనత.
2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా సెల్ఫిష్. ఎక్కువగా... లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు. ఏ చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు.
3.మిథున రాశి..
ఈ రాశివారిలో ధృఢ సంకల్పం చాలా తక్కువ. ఏదీ సాధించాలనే పట్టుదల వీరికి పెద్దగా ఉండదు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా నిరాశావాదులు. ఎప్పుడూ డల్ గా ఉంటారు. ఏదో కోల్పోయిన వారిలా కూర్చుండిపోతారు.
5.సింహ రాశి..
ఈ రాశివారికి కోపం చాలా ఎక్కువ. అంతేకాకుండా.. అందరి మీదా పెత్తనం చేయాలని చూస్తుంటారు. ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు చాలా క్రిటికల్. ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాదు. వీరికి సందేహాలు కూడా చాలా ఎక్కువ.
7.తుల రాశి..
ఈ రాశివారికి మిడిమిడతనం చాలా ఎక్కువ. ఏదీ పూర్తిగా తెలుసుకోరు. అంతా తమకే తెలుసు అనే భ్రమలో ఉండిపోతారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి కోపం, చిరాకు చాలా ఎక్కువ. అంతేకాదు.. ఈ రాశివారిని అన్ని విషయాల్లోనూ పూర్తిగా నమ్మలేం.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి ఓపిక చాలా తక్కువ. ఇక.. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని ప్రిడిక్ట్ చేయలేరు. ఇలా చేస్తే.. అలా జరిగే అవకాశం ఉంది కదా అని కూడా ఆలోచించరు.
10. మకర రాశి..
ఈ రాశివారికి అహంకారం చాలా ఎక్కువ. అందరినీ తన కంట్రోల్ లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారికి చాలా తొందర ఎక్కువ. ఇక ఒక్కోసారి ఉన్నట్లుండి.. అన్నింటి నుంచి దూరంగా వెళ్లిపోతూ ఉంటారు. ఏదీ సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు.
12. మీన రాశి..
ఈ రాశివారు చాలా సెన్సిటివ్. అందరినీ ఇట్టే నమ్మేస్తారు. దానిని అవకాశంగా తీసుకొని.. చాలా మంది వీరిని మోసం చేయాలని చూస్తుంటారు..!
