1.బ్రహ్మాజి

ఉద్యోగం మరియు వివాహం

మీకు 2020 ఫిబ్రవరి వరకు ప్రస్తుతం సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నది. ప్రస్తుత సమయంలో మీకు ఉద్యోగంలో స్థిరత్వం మరియు వివాహం చేసుకోకపోతే తర్వాత అంత అనుకూలం కాదు. 2020 దాితే తిరిగి 2023 వరకు ఏ పనికి కూడా అంత అనుకూలమైన సమయం కాదు. కనుక తొందరపడండి.

జపం : హరహర శంకర జయజయ శంకర, శ్రీ రాజమాతంగ్యై నమః జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : 1. ఆకుకూరలు/ కాయగూరలు / ఆకుపచ్చ వస్త్రాలు, 2. గోధుమపిండి / చపాతీలు / గోధుమరవ్వం మొదలైనవి నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

2.జనార్థన్ రావు 

జాతకం ఎలా ఉంది?

ప్రస్తుతం మీకు ఈ సంవత్సరాంతం వరకు సమయం అన్నివిధాలా అనుకూలంగానే ఉన్నది. తర్వాత 2020 ఒక సంవత్సరం అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి 2021 నుంచి అన్ని పనుల్లో అనుకూలంగా ఉంటుంది.

జపం : మంగళం భగవాన్‌ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః

ఈ జపం నిరంతరం చేసుకోవాలి.

దానం : కందిపప్పు/ దానిమ్మపళ్ళు / కర్జూరాలు/ 2. నూనె / పల్లీలు/ పశుపక్షాదులకు ఆహారం, నీరు పెట్టడం 3.   ఆకుకూరలు / కాయగూరలు దానం చేయడం మంచిది.

4. రవికుమార్‌

జీవితం ఎలా ఉంటుంది?

ప్రస్తుతం సమయం అంత అనుకూలమైనది కాదు. ఒక సంవత్సరం పాటు అన్ని పనుల్లో నిరాశలు ఉంాయి. ఏ పని కలిసిరాదు. మీకు అవసరం లేని ఒత్తిడి మీ వద్దకు వస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం, కాలం, శ్రమ అన్నీ వృథా అవుతాయి. మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు మాట పడాల్సి వస్తుంది. అధికారులతో, పెద్దవారితో జాగ్రత్తగా మెలగడం మంచిది. మీకు కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిరంతం యోగా ప్రాణాయామాలు చేయడం మంచిది. ఇది జీవితాంతం చేయాలి.

జపం : హరహర శంకర, జయజయ శంకర ఈ జపం నిరంతరం చేస్తూ ఉండాలి.

దానం : 1. గోధుమపిండి/ గోధుమరవ్వ/ చపాతీలు, 2. నూనె/ పల్లీలు, 3. మినప సున్ని ఉండలు/ ఇడ్లీ/ వడ.

5. సోమశేఖర్‌

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

2020 జనవరి తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుతకాలంలో సమయం, ధనం, శ్రమ వృథా అవుతాయి. పెట్టుబడులు లాటి విషయాల్లో అత్యాశకు పోయి పెట్టుబడి పెట్టరాదు. ఏవైనా వస్తువులు, వాహనాలు తీసుకోవాలన్నా ఒకికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు పనికిరాదు. అత్యాశ ఉంటుంది. దానిని తగ్గించుకోవాలి.

జపం : హరహర శంకర, జయజయ శంకర

దానం : ఇడ్లీ/ వడ/ మినప సున్నిఉండలు, 2. నూనె, పల్లీలు నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

5. రంజలి పాఠక్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

ప్రస్తుతం ఏప్రియల్‌ లోపు చేసుకుంటే సమయం అనుకూలంగా ఉంది. మంచి పనులు చేస్తూ వివాహ ప్రయత్నాలు చేస్తే తొందరగా కదురుతుంది. ఇప్పుడు కాకపోతే 2023 వరకు తిరిగి సమయం బాలేదు. వివాహానికి అంత అనుకూలంకాదు. జాగ్రత్తపడాలి. మీరు మంచి పనులు చేస్తూ ఉంటే ఉన్నత స్థితిలోకి వెళతారు.  మీరు దానధర్మాలు అధికంగా చేయాలి. అప్పుడు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే శ్రమకు తగిన ఫలితం రాలేదని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంారు. సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

దానం : అన్నదానం / పాలు/ పెరుగు, 2. కందిపప్పు / కర్జూరాలు/ దానిమ్మపళ్ళు నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

జపం :కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళంఈ జపం నిరంతరం చేసుకుంటూ ఉండండి.

రాం ప్రసాద్‌

ప్రస్తుతం మీకు అన్ని పనులకు సమయం అనుకూలంగా ఉన్నది. కొంత జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. మీరు దానాలు అధికంగా చేయాలి. లేకపోతే మీకు ఎదుగుదల ఉండదు. మంచి సమయం ఉన్నప్పుడు కూడాఅధికంగా కష్టపడాల్సి వస్తుంది. 2020 చివరినుంచి2021 చివరి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు/ పూలు, 2. ఇడ్లీ / వడ / మినప సున్ని ఉండలు. దానం చేయడం మంచిది.