Asianet News TeluguAsianet News Telugu

వార ఫలాలు: ఓ రాశివారికి అమ్మకాలు,కొనుగోళ్లు కలిసి వస్తాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. 

Weekly Horoscope 19th march to 25th March 2023
Author
First Published Mar 19, 2023, 9:57 AM IST

వార ఫలాలు : 19  మార్చి  2023 నుంచి 25  మార్చి 2023 వరకు
 
  
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
 మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ ఆది గురు శుక్ర
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును ‌. ప్రయత్నించిన ప్రతి విషయంలోను విజయం సాధిస్తారు. ఉద్యోగ విధి నిర్వహణ అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహన కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారం నందు అభివృద్ధి కనపడును. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్ర దర్శన చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును. గత కొంతకాలంగా నిలిచిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకును. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. పిల్లల యొక్క అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు. ధనధాన్యాదిలాభం చేకూరును. వారాంతం లో చేయ పని యందు శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజం నందు ప్రతికూలత వాతావరణం.


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ ఆది -గురు -శుక్ర
ఉద్యోగ ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. బంధువుల ద్వారా శ్రయోదాయక వార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల యందు అభివృద్ధి ప్రయత్నాల యందు తోటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విశేషమైన  కార్యక్రమాలు యందు తెలివితేటలుగా విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారం నందు కష్టాన్ని దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. దురాలోచన అసూయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. సమాజము నందు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. వారాంతం లో ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత రుణం చేయవలసి వస్తుంది. అనుకోని సమస్యలు ఏర్పడి మనస్సు నందు కలత ఏర్పడును.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
ఋణాల విషయంలో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులు సకాలంలో చేయలేకపోవడం వలన ఇబ్బందులు పడుతుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చికాకులు తప్పవు. నూతన ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. అవసరానికి ధనం ఏదో విధముగా సర్దుబాటు జరుగుతుంది.
ఆరోగ్య ప్రతిబంధకాలు ఏర్పడగలవు. భార్య పుత్రుల తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.  వృత్తి వ్యాపారం నందు శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేయి ‌ వ్యవహారము యందు అడ్డంగులు ఏర్పడను. బంధుమిత్రదులతో కలహాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల తోటి సమస్యలు ఎదురవగలవు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగమునందు సహోద్యోగులు వలన ఇబ్బందులకు గురవుతారు. ఇతరులతోటి కలహాలకు వాగ్వాదములకు దూరంగా ఉండాలి. వారాంతం లో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
ప్రతి విషయము నందు ఒత్తిడి తగ్గించుకుని ముందుకు సాగవలెను. కుటుంబ విషయాలు ఇబ్బందికరంగా ఉండును. ఖర్చు యందు నియంత్రణ అవసరము. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి వ్యాపారములు నిబద్ధతతో చేయవలెను. సంఘము నందు విచిత్రంగా అవమానాలు ఏర్పడతాయి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా అమలు చేయండి. శారీరత మానసిక చికాకులు అధికమవుతాయి. ఋణ విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను. తలపెట్టిన పనులు మందగుడిగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొద్ది సమయం కుటుంబ సభ్యులతో మరియు పిల్లలతోటి సరదాగా గడపండి. ఇష్టం లేనచోట ఉండటం ఇష్టంలేని భోజనాలు చేయవలసి వస్తుంది. కొన్ని విషయాలు మానసిక ఉద్రేకతకు దారితీయును. వారాంతం లో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
పాత సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు దొరుకును. దీర్ఘాలోచనతోటి చేసిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారం నందు అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు  ఉపాధి అవకాశాలు లభించును. ఋణ సమస్యలు ఉన్నవారికి ఋణాలు కొంతమేర తీరి ప్రశాంతత లభిస్తుంది. సమాజము నందు గౌరవ మర్యాదలు పొందగలరు. శుభకార్య ప్రయత్నాలు చేయువారు శుభవార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలు విరోధాలు విషయాలలో ఇతరులతోటి మంచి సలహాలు పొందగలరు. ఆర్థిక విషయాలలో చక్కటి తెలివితేటలు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. వారాంతం లో ఇతరులతోటి కలహాలకు విరోధాలకు దూరంగా ఉండవలెను. ఉదర సంబంధిత అనారోగ్యాలు ఏర్పడవచ్చు.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

పనుల యందు గాని సమస్యలు యందు  కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారమునందు ఊహించని ధన లాభం పొందుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలంకార వస్తువులు గృహోపకరణ వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. పిల్లల యొక్క అభివృద్ధి విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.
శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా నుండును. వివాదాలు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. సమాజం నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారాంతం లో ఎదుటివారిపై పై చేయి సాధిస్తారు. తల పట్టిన పనులు మందకొడి గా సాగును. పై అధికారులతోటి వివాదాల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగును.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
ప్రతి విషయం నందు అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనివలెను. కుటుంబ విషయాలలో వాదోపవాదములకు దూరముగా ఉండవలెను. సమాజమునందు మిత్రులు యందు ఆగ్రహ వేషాలు తగ్గించుకుని మైత్రి భావన తోటి సఖ్యతగా ఉంటూ పనులు పూర్తి చేయాలి. ఋణ బాధలు ఏర్పడగలవు. శుభకార్య ప్రయత్నాలు  పట్టుదల తోటి చేయవలెను. శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకోవడం కష్టంగా ఉండును. ఉద్యోగం విషయంలో అధికారుల యొక్క ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా ధనం వృధాగా ఖర్చు చేస్తారు. వారాంతం లో సమాజం నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
కోపావేశలు తగ్గించుకొనవలెను. సాంఘిక కార్యక్రమాల విషయంలో జాగ్రత్త అవసరము. ఆరోగ్యం నందు ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొన్ని విషయాల యందు మానసిక ఒత్తిడికి లోనవుతారు. సమాజం నందు అవమానవులు బాధలు ఇలాంటి ఘటనలు ఎదురవుతాయి జాగ్రత్తలు తీసుకొని వలెను. కుటుంబం నందు తరచు మాట పట్టింపులు విరోధాలు ఏర్పడగలవు. ఆదాయ మార్గాలు తగ్గడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారములు సరిగా నిర్వహించలేరు. ఉద్యోగమనందు అధికారుల ఒత్తిడి పెరిగి చికాకు పుట్టి అసంతృప్తి చెందుతారు. కోర్టు వ్యవహారములు యందు పెద్దల యొక్క జాగ్రత్తలు సూచనలు పాటించవలెను. వారాంతం లో మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
గతంలో పడిన శ్రమకు ప్రతిభా పురస్కారాలు పొందుతారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా లాభం చేకూరును. ప్రతి విషయం జాగ్రత్తగా ఆలోచించి చేయవలెను. ఎవరి విషయాలలో జోక్యం చేసుకొనకూడదు. తలపెట్టిన పనులు వేగంగా జరుగును. ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారములు లేదా ప్రయత్నాలు స్వయంగా చూసుకోవడం మంచిది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థిక వనరులు చక్కగా సమకూర్చుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చక్కగా నిర్వహిస్తారు. ఉద్యోగ విషయం నందు సంతృప్తిగా నుందురు. కోర్టు కేసులు వివాదాలు పరిష్కార మార్గాలు దొరుకును. విద్యార్థులకు అనుకూలం. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. వారాంతం లో తలపెట్టిన పనులు పట్టుదలతోటి చేసినట్లయితే విజయం సాధిస్తారు. ఆలోచించి ఖర్చులు చేయవలెను. మిత్రుల తోటే సఖ్యతగా మెలగవలెను.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
కుటుంబ విషయాల గురించి భార్యా పుత్రుల తోటి కలహాలు ఏర్పడవచ్చు. శుభకార్యాల ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆదాయం ఆర్థిక ఖర్చులు రెండు సమానంగా ఉండును. ఋణదాతలు నుండి అవమానములు ఏర్పడగలవు. మానసికంగా తెలియని ఒత్తిడిలకు చికాకులకు లోనవుతారు. ఉద్యోగమనందు అధికారుల ఒత్తిడి ఎక్కువుగా ఉంటాయి. వృత్తి వ్యాపారములు నిస్తేజముగానుండును. ఆరోగ్య విషయంలో ప్రతికూలతలు వాతావరణం ఏర్పడుతుంది. ఓర్పు చాలా అవసరము. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆచితూచి వ్యవహరించవలెను. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడిన చివరకు అన్ని పనులు సానుకూలం అవుతాయి. ఆర్థిక కార్యకలాపాల యందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వారాంతం లో చేయ పని యందు బుద్ధి కుశలత అవసరము. వచ్చిన అవకాశాల్ని వదలకుండా సద్వినియోగం చేసుకొనవలెను. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండవలెను.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
విలాసవంతమైన వస్తువులు కొనుగోలు యందు జాగ్రత్త అవసరము. బంధుమిత్రులు మీ అవసరానికి అనుగుణంగా సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగవనందు ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన ప్రతి పనులను విజయం సాధిస్తారు. శుభకార్య నిమిత్తం గాని లేదా ఆధ్యాత్మిక కార్యక్రమం గానీ ధనాన్ని ఖర్చు చేస్తారు. గత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు మీద దృష్టిసారిస్తారు. ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. వృత్తి వ్యాపారులు అనుకూలంగా ఉండను. ఆధ్యాత్మిక సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలించును ‌. సమాజము నందు బహుమానాలు సన్మానాలు అందుకుంటారు. మిత్రుడు యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు.. వారాంతం లో తలపెట్టిన పనుల్లో ప్రతికూలత వాతావరణ. సమాజం నందు అపవాదములు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు ఏర్పడను.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

ఉద్యోగమునందు అధికారుల ద్వారా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండవలెను. పూర్తి వ్యాపారం నందు చికాకులు అధికంగా ఉండును. కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. శుభకార్య ప్రయత్నాలలో అవాంతరాలు నూతన వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు ఇతరుల యొక్క సలహాలు సూచనలు దూరంగా ఉండాలి. ఏ పని ముట్టుకున్న ఆటంకాలు ఏర్పడతాయి. భాగస్వామి వ్యాపారము యందు జాగ్రత్త అవసరము. ఉద్యోగమునందు అధికారుల తోటి ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వాగ్వాదములు యందు జాగ్రత్తల అవసరము. బద్ధకము అలసత్వము వలన వచ్చిన అవకాశాలనుచేజారుస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను.  ప్రతి పనిలోనూ అసౌకర్యం ఏర్పడుతుంది.వారాంతం లో కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు . మిత్రుల యొక్క ఆదరణ అభిమానులు పొందుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios