Asianet News TeluguAsianet News Telugu

దిశలు - శుభాశుభ ఫలితాలు

పడమర, దక్షిణ దిశలలో వీధులు ఉండే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. నైరుతి బ్లాకు వాస్తు ప్రకారంగా ఉండి అలాంటి స్థలాలలో పెద్ద పెద్ద కట్టడాలు ఉంటే వ్యాపార రంగంలో బాగా రాణింపు ఉంటుంది.
 

Vastu tips For Good Luck
Author
Hyderabad, First Published Aug 7, 2021, 2:42 PM IST

 

స్వంత వ్యాపార, వ్యవహార కల నెరవేర్చుకోవడానికి అనేక రకాలుగా వ్యయ ప్రయాసలు పడుతుంటారు. కలగన్న నిర్మాణం సాకారం కావాలంటే మన గ్రహ దశ బాగుండాలి. 

జాతక ప్రకారం గృహ యోగానికి దశ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గృహా యోగం ఏర్పడుతుంది. కట్టే / కొనే నిర్మాణం అన్ని విధాలుగా వాస్తు ప్రకారం దిశకొలతలు అనుకూలంగా ఉండాలి. 

దిశ మారుతే వాస్తు పరంగా శుభాశుభ ఫలితాలు శాస్త్ర పరంగా ఎలా ఉంటాయో కొన్నింటిని గమనిద్దాం.

పడమర, దక్షిణ దిశలలో వీధులు ఉండే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. నైరుతి బ్లాకు వాస్తు ప్రకారంగా ఉండి అలాంటి స్థలాలలో పెద్ద పెద్ద కట్టడాలు ఉంటే వ్యాపార రంగంలో బాగా రాణింపు ఉంటుంది.

నైరుతి మూలలో మనకున్న స్థలం మొత్తం మిగితా దిశలకంటే ఎత్తుగా ఉండాలి. నైరుతి దిశ ఎత్తుగా ఉండడం వలన ఆధాయభివృద్దితో పాటు కార్యసిద్దిని కలుగజేస్తుంది. 

నైరుతి మూల దక్షిణ ఆగ్నేయం వైపు గాని పశ్చిమ వాయువ్యం వైపు కాని తక్కువ కాకుండా పెంపు లేకుండా ఖచ్చితంగా మూలమట్టానికి '90' డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. 

దక్షిణ నైరుతి పెరుగుదల వలన నైరుతి వీధిపోట్లు, అందులో బావులు, బోర్లు ఉండి పల్లంగా ఉంటే అందులో నివసించే స్త్రీలకు దీర్ఘవ్యాదులు మరియు వివిధ ప్రమాదాలకు గురి అయ్యే సూచనలున్నాయి. పోలీస్ లేదా కోర్టు సంబంధిత చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. 

పశ్చిమ నైరుతిలలో దోషాలు ఉన్నట్లైతే పురుషులు దుష్పాలితాలను అనుభవించాల్సి వస్తుంది. 

పడమర వాయవ్యంలో కాని దక్షిణ ఆగ్నేయంలో కాని ద్వారాలు ఉండవచ్చును.

దక్షిణ, పశ్చిమ నైరుతిలలో ద్వారాలు ఉంటే అనారోగ్యంతో పాటు అనేక ఇబ్బందులతో జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. 

పడమర, దక్షిణ దిశలో ఫ్లోరింగ్ లెవెల్ కన్నా అరుగులు ఎత్తుగా ఉండాలి, పల్లంగా ఉండ కూడదు. 

తూర్పు ఈశాన్యం తగ్గి, పశ్చిమ నైరుతిలో ద్వారాలు ఉండకూడదు. 

ఉత్తరం దిశ మూసివేసి దక్షిణ నైరుతిలో ద్వారమున్న అక్కడ పనిచేసే స్త్రీ ఉద్యోగులకు శ్రమతో కూడుకున్న వ్యవహారం కొనసాగుతుంది. సుఖము తక్కువగా ఉంటుంది. 

ఉత్తర ఈశాన్యం తగ్గిపోయి తూర్పు హద్దుపై నిర్మణం గల ఇంటికి నైరుతి దోషాలు ఉంటే అలాంటి నిర్మాణంలో వ్యాపారంలో ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అన్ని అంతరాయాలు ...చివరకు వ్యాపారం పరహస్తం అయ్యే అవకాశాలుంటాయి.   

నైరుతి దిశలో ఏలాంటి లోపం ఉండకూడదు .

ఈశాన్యంలో నిప్పుకు సంబంధించిన వ్యవహారం ఉండకూడదు. క్యాంటిన్ లాంటివి ఉండ కూడదు. ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉండడం శ్రేయస్కరం కాదు.

ఈశాన్యంలో నిప్పుకు సంబంధించినవి ఉండి నైరుతిలో ద్వారాలు ఉంటే అందులో ఉండే వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహలోపం ఏర్పడి ...అన్యోన్నతలు లోపిస్తాయి.

నైరుతి దిశ వైపు పల్లంగా ఉండకూడదు, బోరు, బావి, సంపు లాంటివి అస్సలు ఉండకూడదు. 

గృహనికి నైరుతి భాగంలో ఎతైన అరుగులు నిర్మించడం, బరువులు వేయటం వలన ఆర్థిక లాభాలుంటాయి. 

నైరుతి గది వైశాల్యము ఈశాన్యం గది వైశాల్యం కన్నా ఎక్కువగా ఉండాలి.

నైరుతి మూలలో ఎదైన నిర్మాణము చేయలనుకుంటే పని ప్రారంభం అయిన నాటి నుండి నిర్మాణము ఆగకుండా పని జరగాలి. ఒకవేళ నిర్మాణము ఆగితే తిరిగి కట్టడం కష్టతరం అవుతుంది తోబాటు ఆర్థిక బాధలు, ప్రాణాపాయములు ఉండే అవకాశాలుంటాయి. 

ముఖ్యంగా నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను ( మెటీరియాల్) సమకూర్చుకున్నాకనే నిర్మాణం మొదలుపెట్టాలి.

నిప్పుకు సంబంధించినవి ఆగ్నేయ దిశలోనే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. 

ఉత్తరం వైపు హద్దు చేసి దక్షిణం దిశ వైపు ఖాళీ స్థలం వదలి నిర్మించాలకుంటే ఇల్లు పూర్తికాక పోవటమో లేక అనేక ఆర్ధిక కష్ట నష్టాలకు గురిచేయడమే కాకుండా ఎన్నో ఆశలతో నిర్మించుకున్న దానిని అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువెలుతుంది. 

దక్షిణ, ప‌శ్చిమ‌, నైరుతుల‌లో ఏమైన నిర్మాణాలు చేయాలనుకున్నప్పుడు ప్లోరింగ్ విషయంలో మాత్రం పై క‌ప్పు లెవెల్ ఎంత మాత్రం ప‌ల్లంగా ఉండ‌కూడ‌దు, ఇది అత్యంత ముఖ్యమైన విషయం. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి వ్యాపార, వ్యావహారాలలో అభివృద్దికి సహకరించాలంటే తప్పక వాస్తు శాస్త్ర ప్రకారమే నిర్మాణం చేసుకోవాలి.

భవనం/ ఫ్యాక్టరీ / వ్యాపార సముదాయాలు కట్టి అద్దేకు ఇచ్చినా లేదా యజమానే వ్యవహరించిన వాస్తు ఫలితం అనేది ఇంటి యజమానికి, అద్దే ఉన్నవారికి కూడా సమానంగా వర్తిస్తుంది. స్వంత ఆలోచనలు మాని వాస్తుశాస్త్ర సూత్రాలను పాటిస్తే అన్ని విధాలుగా సుదూరకాలాలకు ( Long term) అనుకూలంగా ఉంటుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios