Ugadi 2023: ఉగాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలకు కొత్త సంవత్సరం. అందుకే ఉగాదికి ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇంట్లోని పాత వస్తువులను పారేస్తుంటారు.  


Ugadi 2023: ఉగాదికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ నెల 22 తారీఖునే ఈ పండుడ. ప్రతి ఏడాది చైత్ర మాసం శుక్ల పక్షంలో ఉగాదిని జరుపుకుంటారు. ముందే ఈ పండుగ తెలుగువాళ్లకు కొత్త సంవత్సరం. అందుకే అంతా ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. పెయింటింగ్స్ వేయిస్తారు. ఇంటినంతా పూలతో అలంకరిస్తారు. అయితే దీనికంటే ముందు ఇంట్లోని కొన్ని పాత వస్తువులను పారేయాలని జ్యోతిష్యం చెబుతోంది. ఎందుకంటే ఇవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతాయట. మరి ఉగాది రాక ముందే ఎలాంటి వస్తువులను ఇంట్లో ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జ్యోతిష్యుల ప్రకారం.. విరిగిన దేవతా విగ్రహాలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. అందుకే వీటిని ఉగాదికి ముందే ఇంట్లో నుంచి తీసేయండి. అయితే విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. నీటిలోనే వేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

పనిచేయని గడియాలను కూడా ఉగాదికి ముందే ఇంట్లో నుంచి బయటపడేయండి. ఎందుకంటే పనిచేయని గడియారం మీకు లక్ లేకుండా చేస్తుంది. పనులు ఆగిపోయే ఛాన్స్ కూడా ఉండి. పనిచేయని గడియారం ఉంటే ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే వీటిని ఇంట్లో ఉంచకండి.

జ్యోతిష్యుల ప్రకారం.. పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచకూడదు. అంటే గ్లాస్ తో చేసిన ఏ వస్తువైనా సరే పగిలిపోతే ఈ ఉగాదికి ముందే ఇంట్లోంచి తీసేయండి. వీటిని ఇంట్లో ఉంచితే ఆర్థిక పరిస్థితి బాగుండదు. 

పుస్తకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కానీ జ్యోతిష్యం ప్రకారం.. చిరిగిపోయిన పుస్తకాలను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. అందుకే వీటిని అమ్మేయండి.

కుంకుమ, పసుపులను పవిత్రమైనవిగా భావిస్తారు. కానీ ఇప్పటికే ఉన్న పసుపు, కుంకుమలను ఇంట్లో ఉంచుకోకూడదని జ్యోతిష్యం చెబుతోంది. అందుకే వీటిని నీట్లో వేసి ఉగాదికి కొత్తగా కొనండి.