శ్రీ శోభకృత్ నామ సంవత్సర: కన్య రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం కన్య రాశివారికి ఈ ఏడాది సమాజం లో మీ మాటకు విలువ పెరుగుతుంది. గురు సంచారం వలన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం లో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వలెను

Ugadi 2023 telugu panchangam rasi phalalu of Virgo

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
 

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఆదాయం:-2
వ్యయం:-11
రాజపూజ్యం:-4
అవమానం:-7

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి సప్తమ స్థానములో సంచారం చేసి ఏప్రిల్ 21 నుండి అష్టమ స్థానము లో సంచారం చేయను.

శని:-సంవత్సరం అంతా షష్టమ స్థానములో శని సంచారం చేయను.

రాహు:-సంవత్సర ప్రారంభం నుండి అష్టమ స్థానమందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి సప్తమ స్థానము లో సంచారం చేయను.

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేసి అక్టోబర్ 31 నుండి జన్మరాశిలో సంచారం చేయను.

ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగుతుంది. సమాజం లో గౌరవ ప్రతిష్టలు కోల్పోతారు.  శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. చేయ పనులలో పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం కలుగుతుంది. ముఖ్యమైన వస్తువుల విషంలో జాగ్రత్త అవసరం . ఏప్రిల్ దాటిన తర్వాత  ప్రయత్నించిన పనులన్నీ కూడా జయప్రదంగా పూర్తవుతాయి . వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతాయి.  కుటుంబం లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. గృహ భూ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును.   సమాజం లో మీ మాటకు విలువ పెరుగుతుంది. గురు సంచారం వలన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం లో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వలెను. ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. సమాజం నందు వ్యవహారములు ఆచితూచి వ్యవహరించవలెను. రాహు కేతు సంచారం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఇతరులతోటి ఆకారణంగా కలహాలు ఇబ్బందులు ఎదురవుతాయి. కావున ఏప్రిల్ దాటిన తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం , గురుగ్రహ జప శనగలు దానం చేయడం. అలాగే నవంబరులో రాహు కేతువులకు జపదానములు చేయడం ఉత్తమం.

ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 
 

ఎప్రిల్
భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్య వలన ఆ కారణ కలహాలు ఏర్పడవచ్చు. మనస్సులో నిరోత్సాహంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యంలో కొద్దిపాటిసమస్యలు ఏర్పడగలవు. బంధుమిత్రులతోటి విరోధాలు రావచ్చు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనాలోచిత పనుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగమనందు అధికారుల  ఒత్తిడులు పెరుగును.

మే
ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల తోటి ప్రతికూలత వాతావరణ. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగం లో అధికారుల వలన భయంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. చేసే పని యందు అధిక శ్రమ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఇతరులు చూస్తూ ఉంటారు.

జూన్
చేయ వ్యవహారంలో మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. వృత్తివ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగమనందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కీలకమైన సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబం లో సంతోషకరమైన వాతావరణ ఏర్పడుతుంది.

జూలై
సమాజం లో అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. బంధవర్గంతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. ఆదాయానికి మించి అనేక విధాలుగా ఖర్చు చేయవలసి వస్తుంది. వివాదాలకు కలహాలు దూరంగా ఉండండి. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఇబ్బందులు కలుగుతాయి.

ఆగస్టు
 ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖర్చు చేయవలెను. వృత్తి వ్యాపారములు అంత అనుకూలంగా లేదు. కుటుంబం లోప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శత్రుభాదులు తప్పవు. తలపెట్టిన పనులలో అపజయాలు ప్రాప్తించగలవు. చేయ వ్యవహారం నందు ఉద్రేకత తగ్గించుకొని వ్యవహరించవలెను.

సెప్టెంబర్
ప్రయత్నించిన పనులు ఫలించును. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికిని తగిన సమయానికి ధనం చేకూరుతుంది. కుటుంబమునందు ప్రతికూలత వాతావరణ.  వ్యాపారం నందు హెచ్చుతగ్గులు ఏర్పడగలవు. మిత్రుల తోటి అకారణ కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగమనందు అధికారుల  ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.

అక్టోబరు
ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. దుష్ట సావాసాలు పెరుగుతాయి. వ్యాపారమునందు ధన నష్టం వాటిల్లవచ్చు. అనుకోని తగాదాలు వివాదాల వలన మనస్సునందు చిరాకుగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల జాగ్రత్త అవసరము. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు.

నవంబర్
చేయ పనులలో మూర్ఖపు పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా సాగును. వృత్తి వ్యాపారం నందు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. బంధుమిత్రులతోటి భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం. అనవసరమైన ఖర్చులు పెరుగుట. సమాజము నందు అవమానాలు ఎదురు గలవు. ఉద్యోగమునందు అధికారులతోటి  నిరాదరణ.

డిసెంబర్
ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నందు ధన లాభం చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం లభించును. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపిస్తారు. నూతన వస్తు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు.

జనవరి
కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాలు కొనుగోలు కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తగును.

ఫిబ్రవరి
శుభవార్తలు వింటారు.వ్యాపారం క్రమం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల  సహాయ సహకారాలు లాబిస్తాయి. గృహవనందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగమనందు అనుకూలమైన అధికారం లభించును.

మార్చి
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. జీవిత భాగస్వామితోటి కొద్దిపాటి మనస్పర్ధలు రాగలవు. వ్యాపారం సజావుగా సాగును. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios