Asianet News TeluguAsianet News Telugu

శ్రీ శోభకృత్ నామ సంవత్సర: ధనస్సు వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం ధనస్సు రాశివారికి ఈ ఏడాది  ఈ సంవత్సరం అన్ని విధాల బాగుంటుంది. గృహమునందు శుభకార్యాలు జరుగును. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును. నిరుద్యోగులకు ఉద్యోగం లభించును.

Ugadi 2023 telugu panchangam rasi phalalu of Sagittarius
Author
First Published Mar 20, 2023, 2:34 PM IST

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1): 
 ఆదాయం:-8
వ్యయం:-11
రాజపూజ్యం:-6
అవమానం:-3

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి చతుర్ద స్థానము నందు సంచారం చేసి ఏప్రిల్ 21 నుండి పంచమ స్థానమునందు సంచారం చేయను.

శని:-సంవత్సర ప్రారంభం నుండి తృతీయ స్థానం నందు సంచారం చేయను.

రాహు:-సంవత్సర ప్రారంభం నుండి పంచమ స్థానము నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి చతుర్ధ స్థానము నందు సంచారం చేయను.

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి ఏకాదశ లాభస్థానము నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి దశమ స్థానము నందు సంచారం చేయను.

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సర: వృశ్చిక రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు


తలపెట్టిన కార్యాలు న్నీ సకాలంలో పూర్తవుతాయి . వృత్తి వ్యాపారాలు యందు అభివృద్ధి కలుగుతుంది . కొత్త ప్రయత్నాలు చేయు విషయంలో బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . ప్రజలలో మీయొక్క మాటకు విలువ పెరుగుతుంది . శుభకార్యాలలో పాల్గొంటారు . సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి . ఉద్యోగస్తులకు ఉన్నతమైన అధికారం కలుగుతుంది . విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు . వివాహం ప్రయత్నాలు చేయు వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి.  భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి . కోర్టు నందు వ్యవహారాలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని విధాల బాగుంటుంది. గృహమునందు శుభకార్యాలు జరుగును. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును. నిరుద్యోగులకు ఉద్యోగం లభించును.గత కొంతకాలంగా పడిన బాధలు తీరి పరిపూర్ణమైన ఫలితాలను పొందగలరు. ఆర్థికంగా బలపడతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం పూర్తి చేస్తారు. కుటుంబం సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎంతటి కష్టమైనా పని అయినా సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. ఈ సంవత్సరం ఈ రాశి వార నవంబర్ నెలలో రాహువు జపం దానం చేయించుకొనవలెను


ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 
 

ఏప్రిల్
ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుంది. ధన ధాన్య లాభాలు పొందగలరు. ఇష్టమైన పని సాధించుకుంటారు. ప్రత్యర్థులపై పే చేయ సాధిస్తారు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. సంతాన అభివృద్ధి కలుగుతుంది. పెద్దల యొక్క అండదండలు లభిస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సమాజము నందు ఉన్నత స్థితి ఏర్పడుతుంది.

మే
బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ పరమైన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందగలరు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా అవసరానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబం నందు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
జూన్
శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. వృత్తి వ్యాపారములు రాణిస్తాయి. కొద్దిపాటి రుణ బాధలు పెరుగును. సమాజము నందుఅవమానములు రావచ్చు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.
జూలై
శుక్ర గ్రహ సంచారం వలన బంధుమిత్రుల యొక్క కలయక. వృత్తి వ్యాపార ముందు ధన లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. చేయ పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిపాటి ఖర్చులు పెరుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
ఆగస్టు
అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు. దుర్వార్తలు వినవలసి వస్తుంది. ప్రయాణమునందు అవరోధములు ఏర్పడగలవు.  వాగ్వాదాలకు దూరంగా ఉండండి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మనస్సు నందు ఆందోళన ఉండును. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.
సెప్టెంబర్
బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగము నందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. ఆర్థికంగా బాగుంటుంది. సమాజమనందు గౌరవం కీర్తి ప్రతిష్టలు పొందగలరు. చేయు వ్యవహారము నందు మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారముల యందు అభివృద్ధి కనపడను. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

అక్టోబర్
ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులు సకాలంలో పూర్తగును. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. మిత్రుల తోటి అభివృద్ధి సంబంధిత చర్చలు జరుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. చేయ వ్యవహారములు దిగ్విజయంగా పూర్తవుతాయి.
నవంబర్
అన్ని విధాల లాభాలు సమకూరు ను. మనసునందుకు ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ‌ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
డిసెంబర్
దుష్ట సావాసాలు ఏర్పడతాయి. ఇతరులతోటి తగువులకి వివాదాలకు దూరంగా ఉండవలెను. బందోవర్గంతోటి కొద్దిపాటి కష్టాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరమైన అనేక విధాలుగా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. చేయ పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది.
జనవరి
వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.ఇంటా బయటా అధికమైన ఒత్తిడిలు పెరుగును . నిత్యవసరములకు  కొంత ఋణములు చేయవలసి వస్తుంది. అకారణంగా బంధుమిత్రులతోటి వివాదాలు ఏర్పడవచ్చు. అకాల భోజనం. మనసునందు ఆందోళనగా ఉండుట. జీవిత భాగస్వామి తోటి మాట పట్టింపులు రాగలవు.

ఫిబ్రవరి
వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. చేయ వ్యవహారములు అనుకూలించును. కీలకమైన సమస్యలను  ధైర్యంగా ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
మార్చి
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మనసు నందు ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు.  ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఉద్యోగ పరంగా అభివృద్ధి కనపడను. సంసార సౌఖ్యం లభిస్తుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. ప్రయాణాలు కలిసి వస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios