శ్రీ శోభకృత్ నామ సంవత్సర: మకర రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం మకర రాశివారికి  ఈ ఏడాది గృహము నందు కలతలు లేకుండా చూసుకోవాలి . భూ గృహ నిర్మాణ పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి . అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారం నందు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయవలెను. 

Ugadi 2023 telugu panchangam rasi phalalu of Capricorn

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)

ఆదాయం:-11
వ్యయం:-5
రాజపూజ్యం:-2
అవమానం:-6

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి తృతీయ స్థానము నందు సంచారం చేసి ఏప్రిల్ 21 నుండి చతుర్థ స్థానము నందు సంచరించును.

శని:-సంవత్సర అంతా ద్వితీయ స్థానం నందు సంచరించును. (ఏలినాటి)

రాహు:-సంవత్సర ప్రారంభం నుండి చతుర్థ స్థానము నందు సంచరించి అక్టోబర్ 31 నుండి తృతీయ స్థానము నందు సంచరించిను.

కేతువు:- సంవత్సర ప్రారంభం నుండి దశమ స్థానము నందు సంచరించి అక్టోబర్ 31 నుండి భాగ్యస్థానమునందు సంచరించును.


ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పూర్తి చేయాలి. మీ ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండను. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.బంధుమిత్రులతోటి విరోధాలు.  అధిక శ్రమ పెరుగుతుంది . అనవసరమైన ఖర్చులు పెరుగుట.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును . ఆర్థిక ఇబ్బందులు  ఋణాలు చేయవలసి వస్తుంది . సమాజం నందు అపవాదములు కలగొచ్చు. దూర ప్రయాణాలు  చేయవలసి వస్తుంది . సోదరి సోదరులతో టి మనస్పర్ధలు ఏర్పడతాయి . జీవన విధానంలో మార్పులు రావచ్చును . గృహము నందు కలతలు లేకుండా చూసుకోవాలి . భూ గృహ నిర్మాణ పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి . అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారం నందు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయవలెను. కోర్టు వ్యవహారాల యందు అనుకూలమైన తీర్పులు రావచ్చును . దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది .  వివాహం ప్రయత్నాలు ఫలిస్తాయి . వ్యవహారములు యందు బుద్ధి నిలకడ లేక ఇబ్బందులు పడతారు. మానసిక ఆందోళనగా ఉండుట. ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరము. నూతన పెట్టుబడులు వ్యాపారాలు వాయిదా వేయడం మంచిది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. బందోవర్గంలో మీయొక్క విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. శారీరక మానసిక బలంగా ఉండును. ఈ సంవత్సరం ఈ రాశి వారు మే నెలలోశనికి మరియు గురునికి జప దానములు ఏకాదశ రుద్రాభిషేకము చేయుట ఉత్తమం శనివారంలో నియమాలు పాటించుట నవంబర్లో కేతు జపం  దానం చేయుట మంచిది.

 ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 
  

ఏప్రిల్
బంధువుల యొక్క ఆదరణ అభిమానాల పొందగలరు. ఉద్యోగమందు అధికార అభివృద్ధి కలుగుతుంది. గుడుంబా సభ్యులతో కలిసి విందు వినోదయాత్రలు చేస్తారు. చేదు వ్యవహారము యందు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. ఆర్థికంగా బాగుంటుంది. ఎలకమైన సమస్యలు పరిష్కారమగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

మే
అనుకున్న పనులు అనుకొనట్లుగా పూర్తి చేస్తారు. మీ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. సంతానం అభివృద్ది లోకి వస్తుంది. సమాజము నందు పెద్దల  ఆదరణ అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు  రాణిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

జూన్
ఆదాయ మార్గాలు బాగున్నాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజం నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. చేయు వ్యవహారము నందు అన్నదమ్ముల మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

జూలై
ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కొంత ఋణం చేయవలసి వస్తుంది. ప్రయత్నించిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారమునందు శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజం నందు ప్రజాభిమానం పొందగలరు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవగలవు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. వచ్చిన అవకాశాలని చేజార్చగూడదు.

ఆగస్టు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన మాటల ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమనందు అధికార తోటి సమస్యలు వచ్చిన అధికారం వృద్ధి కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. బంధవర్గంతోటి కలహాలు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తగును. వృత్తి వ్యాపారంలో సామాన్యంగా ఉంటాయి.

సెప్టెంబర్
వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్యం బాగుంటుంది.
అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతోటి వాగ్వాదాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

అక్టోబర్
బంధుమిత్రుల తోటి ఆనందంగా వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదరణ పొందగలరు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. జై వ్యవహారము ఇందు మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి.అకారణంగా కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం.

నవంబర్
తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. గృహమునందు శాంతి చేకూరి సంతోషకరమైన వాతావరణ ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు రాగలవు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు.

డిసెంబర్
వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. చేయ పని యందు శారీరక శ్రమ పెరిగి బలహీనత పొందుతారు. జీవిత భాగస్వామి తోటి మాట పట్టింపులు ఏర్పడగలవు. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. చేదు వ్యవహారము నందు అవరోధాలు ఏర్పడగలవు.

జనవరి
చేయి వ్యవహారం నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారము నందు ధనలాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గిర సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రుడు తో కలిసి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగును. ఉద్యోగమునందు సహోద్యోగులు యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు.

ఫిబ్రవరి
బంధు వర్గం తోటి అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. దుష్టసావాసాలకు దూరంగా ఉండవలెను. శత్రువుల వలన భయంగా ఉండను. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. చేయ పని యందు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళనగా ఉండుట. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు.

మార్చి
ఆరోగ్యం బాగుంటుంది. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యల వలన కోపానికి ఉద్రేకతకు గురివుతారు. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios